News


7.50శాతం లాభంతో ముగిసిన యస్‌ బ్యాంక్‌ షేరు

Wednesday 5th February 2020
Markets_main1580898961.png-31537

మూలధనాన్ని పెంచుకునేందుకు రుణాలిచ్చేందుకు రుణదాతలు ముందుకొచ్చారనే వార్తల నేపథ్యంలో బుధవారం యస్‌ బ్యాంక్‌ షేరు 7.50శాతం లాభంతో రూ.37.60 వద్ద ముగిసింది. నేడు ఈ బ్యాంక్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.35.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. యస్‌ బ్యాంక్‌లో  2బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ ఎల్‌పి, ఐడిఎఫ్‌సి సెక్యూరిటీస్ లిమిటెడ్, అంబిత్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ముందుకొచ్చినట్లు ఈ వ్యహారంతో సంబందం ఉన్న ముగ్గురు వ్యక్తులు పేర్కోనారు. అయితే ఈ నిధుల సమీకరణ అంశంపై స్పందించేందుకు యస్‌బ్యాంక్‌ అధికార ప్రతినిధులు, సంబంధిత ఫండింగ్‌ సం‍స్థలు స్పందించేందుకు నిరాకరించాయి. షేర్లు ఒకదశలో 14శాతం లాభపడి రూ.39.75 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.

బ్యాంకు ఫిబ్రవరి 07న ఉదయం గం.11:00లకు ముంబైలో ఈజీఎమ్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ సమావేశంలో అధీకృత వాటా మూలధనాన్ని రూ .800 కోట్ల నుంచి రూ .1,100 కోట్లకు పెంచడానికి అనుమతులుతో పాటు మూలధన అంశంపై చర్చలు జరగవచ్చని తెలుస్తోంది.

మొండిబకాయిలు, ఆస్తి నాణ్యతలతో యస్‌బ్యాంక్‌ మూలధన సమీకరణకు తీవ్ర ఇబ్బందుకులకు లోనవుతోంది.బ్యాంక్‌ నియంత్రణ ఈక్విటీ క్యాపిటల్ నిష్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రస్తుతం రెగ్యూలేటరీ కనిష్టం కంటే కేవలం 8శాతం మాత్రమే అధికంగా ఉంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవ్నీత్ గిల్ నేతృత్వంలోని యస్‌ బ్యాంక్‌... నిధుల సేకరణ సామర్థ్యం గురించి ఆందోళనతో గతేడాది కాలంలో షేరు 80శాతం నష్టాన్ని చవిచూసింది. You may be interested

వొడాఫోన్‌ ఐడియా ఉంటేనే మంచిదంటున్న ఎయిర్‌టెల్‌

Thursday 6th February 2020

వొడాఫోన్‌ ఐడియా పరిస్థితి సంక్లిష్టంగానే ఉందంటూ వొడాఫోన్‌ గ్రూపు సీఈవో నిక్‌రీడ్‌ మరోసారి తాజాగా ప్రకటించగా.. వొడాఫోన్‌ ఐడియా కచ్చితంగా ఉండాల్సిన అవసరాన్ని పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ బలంగా వ్యక్తీకరించింది. ఎందుకన్నది కూడా ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విట్టల్‌ తెలిపారు. భారత టెలికం మార్కెట్లో మూడు సంస్థలు (ప్రయివేటు) ఉంటేనే మంచిదన్నది ఆయన విశ్లేషణ. దీనివల్ల పెట్టుబడులకు సానుకూలమని, ఉద్యోగాల నష్టం జరగదని వివరించారు. అలాగే, పరిశ్రమ ప్రతిష్టను

మూడో రోజూ మార్కెట్‌ స్పీడ్‌

Wednesday 5th February 2020

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ 41,000 పాయింట్ల ఎగువకు నిఫ్టీ సైతం లాభాల సెంచరీ ఎన్‌ఎస్‌ఈలో మీడియా వెనకడుగు  వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సాధించింది. 353 పాయింట్లు జమ చేసుకుని 41,143 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు ఎగసి 12,089 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సె‍క్స్‌ తిరిగి 41,000 పాయింట్ల మార్క్‌ను దాటేయగా.. నిఫ్టీ 12,000 స్థాయికి

Most from this category