News


యస్‌బ్యాంక్‌ 8 శాతం క్రాష్‌

Thursday 19th September 2019
Markets_main1568875558.png-28431

ప్రైవేట్‌రంగ యస్‌ బ్యాంక్‌ షేర్లు వరుసగా 4వరోజూ నష్టాల బాట పట్టాయి. నేడు బ్యాంక్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.64.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. యస్‌బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణాకపూర్‌కు చెందిన మోర్గాన్‌ క్రెడిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎంసీపీఎల్‌) నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లపై రేటింగ్‌ను కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎ(-) రేటింగ్‌ నుంచి బిబిబి(-)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే రియల్టీ ఫైనాన్సింగ్‌ కంపెనీ అల్టికో డిఫాల్ట్‌ అయిన ఫలితంగా నేటి ఉదయం సెషన్‌లో యస్‌ బ్యాంక్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై ఒకదశలో 8 శాతం నష్టపోయి రూ.58.5 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఎంసీపీఎల్‌కు యస్‌బ్యాంక్‌లో సంస్థ 3.03శాతం శాతం వాటా కలిగి ఉంది. అల్టికోకు రూ. 450 కోట్ల రుణాన్ని యస్‌బ్యాంక్‌ ఇచ్చివుంది. ఉదయం గం.11:45ని.లకు యస్‌ బ్యాంక్‌ షేర్లు క్రితం​ముగింపు ధర(రూ.64.10)తో పోలిస్తే 7.02శాతం నష్టపోయి రూ.59.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఏసీఈ గణాంకాలు ప్రకారం యస్‌ బ్యాంక్‌ షేర్లు చివరి ఆరునెలల్లో 77శాతం క్షీణించాయి. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.53.20లు, రూ.328.95లుగా నమోదయ్యాయి. 



You may be interested

లిక్విడీటీ సంక్షోభం ముగుస్తుంది!

Thursday 19th September 2019

-ఎడల్వీస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రాషేస్‌ షా   ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌) అల్టికో క్యాపిటల్‌ ఇండియా కంపెనీ, గత వారం డీఫాల్ట్‌ను ఎదుర్కొంది. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ కొరత ఆందోళనలు తిరిగి పెరిగాయి. అయినప్పటికి దేశంలో లిక్విడిటీ సంక్షోభం ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ముగుస్తుందని ఎడల్వీస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రాషేస్‌ షా అభిప్రాయపడ్డారు. ‘ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, ప్రభుత్వానికి తన అదనపు నిధులను

తగ్గిన పసిడి

Thursday 19th September 2019

వడ్డీరేట్ల తగ్గింపు రానున్న నెలల్లో ఉండకపోవచ్చనే సంకేతాలతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 11.50డాలర్లు నష్టపోయి 1,504.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది. అమెరికాలో నిన్న ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లపై వైఖరీ ప్రకటించింది. అందరి అంచనాలకు తగ్గట్లుగానే వరుసగా రెండోసారి వడ్డీరేట్లపై పావు శాతం మేర తగ్గించింది. అయితే లేబర్‌ మార్కెట్‌ బలంగా ఉన్నందున రేట్ల కోత

Most from this category