News


19నే సూచీల నుంచి నిష్క్రమణ..!

Tuesday 17th March 2020
news_main1584414560.png-32517

తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్‌ బ్యాంక్‌ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్‌ఎస్‌ఈ ఇండిసెస్‌ ఇండెక్స్‌ మెయింటెనెన్స్‌ సబ్‌-కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్‌ బ్యాంక్‌ నిష్క్రమించనుంది. నిఫ్టీ 50లో శ్రీ సిమెంట్, నిఫ్టీ బ్యాంక్‌ సూచీలో బంధన్‌ బ్యాంక్, నిఫ్టీ 100లో అదానీ ట్రాన్స్‌మిషన్, నిఫ్టీ 500లో స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ సంస్థలు.. యస్‌ బ్యాంక్‌ స్థానంలో చేరతాయి. 



You may be interested

మార్చి 18 నుంచి పూర్తి సేవలు అందుబాటులోకి: ఆర్‌బీఐ

Tuesday 17th March 2020

పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్‌ బ్యాంక్‌పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. దీంతో ఖాతాదారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్‌డ్రాయల్స్‌ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు.  బ్యాంకును ఆదుకునేందుకు అవసరమైతే అదనంగా నిధులు కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. యస్‌ బ్యాంక్‌ ఇకపైనా ప్రైవేట్‌ సంస్థగానే కొనసాగుతుందన్నారు. 'యస్‌' సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ.. మిగతా

'యస్‌' షేర్ల ట్రేడింగ్‌పై ఆంక్షలు

Tuesday 17th March 2020

ఆందోళనలో ఎఫ్‌పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు మరింత ముందుగానే సూచీల నుంచి తొలగింపు రేపట్నుంచీ బ్యాంక్‌ డిపాజిట్‌  విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షల ఎత్తివేత న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్‌పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు

Most from this category