News


ఐదు స్టాక్‌ సిఫారసులు

Tuesday 17th December 2019
Markets_main1576522805.png-30254

ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి, క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ 3 నుంచి 5 వారాల కోసం కొన్ని స్టాక్స్‌ను సూచించారు. 

 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫారసులు
ఎన్‌ఎండీసీ
టార్గెట్‌ రూ.127. స్టాప్‌లాస్‌ రూ.103. రోజువారీ, వారం చార్ట్‌లు స్థిరమైన ర్యాలీకి సంకేతం ఇస్తున్నాయి. కీలకమైన నిరోధం రూ.115-117ను అధిగమించేందుకు సమీపంలో ఉంది. గత కొన్ని నెలల కాలంలో ఇది కీలక అవరోధంగా ఉంది. ప్రస్తుత ధర నుంచి రూ.108 వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎగువ వైపున రూ.127 వరకు వచ్చే 3-5 వారాల్లో పెరిగేందుకు అవకాశం ఉంది.
 
హిందాల్కో
టార్గెట్‌ రూ.232. స్టాప్‌లాస్‌ రూ.191. గత కొన్ని నెలల్లో దీర్ఘకాల స్థిరీకరణ ప్యాటర్న్‌ నుంచి ముందుకు కదిలింది. ఆ సమయంలో స్టాక్‌ కీలక అవరోధమైన రూ.206-207ను ఎదుర్కొని పైన నిలదొక్కుకోవడంలో విఫలమైంది. ఇటీవలే ఈ నిరోధాన్ని అధిగమించింది. ఈ అవరోధాన్ని దాటుకుని పైకి వెళ్లగలదన్న సంకేతం ఇచ్చింది. రూ.209-210 పైన స్థిరంగా నిలదొక్కుకుంటే సమీప కాలంలో కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. హిందాల్కోను ప్రస్తుత ధర నుంచి రూ.199 వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎగువ వైపున 3-5 వారాల్లో రూ.232 వరకు ర్యాలీ చేయగలదు. స్టాప్‌లాస్‌గా రూ.191 అమలు చేయాలి.

 

క్యాపిటల్‌వయా గ్లోబల్‌ సిఫారసులు
టాటా మోటార్స్‌
టార్గెట్‌ రూ.225. రూ.180-160 శ్రేణిలో నెల పాటు కన్సాలిడేట్‌ అయింది. మేజర్‌ ప్యాటర్న్‌ బ్రేకవుట్‌కు దగ్గర్లో ఉంది. రూ.180 పైకి దూసుకెళితే రూ.225 వరకు ర్యాలీకి అవకాశం ఉంది. ఇతర ఆసిలేటర్లు కూడా బ్రేకవుట్‌ను సూచిస్తున్నాయి. 

 

యస్‌ బ్యాంకు
టార్గెట్‌రూ.150. నిధుల కొరత, నిధుల సమీకరణ ప్రయత్నాలకు సంబంధించి వార్తలు వింటూనే ఉన్నాం. దేశ, విదేశాలకు చెందిన బిగ్‌బుల్స్‌ యస్‌ బ్యాంకు బ్రాండ్‌ విలువ పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చారిత్రకంగా, ప్రస్తుతం కూడా కీలకమైన రూ.30, రూ.45 స్థాయిల వద్ద మద్దతు తీసుకుని వెనక్కి వచ్చింది. వీటి ఆధారంగా రూ.150 లక్ష్యంతో ఈ స్టాక్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

 

అపోలో టైర్స్‌
టార్గెట్‌ రూ.250. చాలా ఏళ్ల కన్సాలిడేషన్‌ అనంతరం ఈ స్టాక్‌ మరోసారి రూ.130-150 శ్రేణిలో మద్దతు తీసుకుంది. తయారీ రంగ కంపెనీగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పన్ను తగ్గింపు ప్రయోజనాలు కంపెనీకి లభిస్తాయి. రూ.250 టార్గెట్‌తో కొనుగోలు చేసుకోవచ్చు. 

 

నోట్‌: ఈ స్టాక్‌ సిఫారసులు నిపుణులు చేసినవి. వీటితో సాక్షి బిజినెస్‌కు సంబంధం లేదు. ఈ సిఫారసులను కేవలం ఇన్వెస్టర్ల అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది.  You may be interested

భారత్‌కు 5 శాతం వృద్ధి మంచిదే: మొబియస్‌

Tuesday 17th December 2019

భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థకు 5 శాతం వృద్ధి రేటు మంచిదేనని వర్ధమాన మార్కెట్ల నిపుణుడు మార్క్‌ మొబియస్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌ ఆకర్షణీయ మార్కెట్‌ అని అభివర్ణించారు. 1980ల చివర్లో భారత మార్కెట్లో పెట్టుబడులను ప్రారంభించిన ఆయన, ఈ స్థాయిలో భారత్‌ ఆర్థిక వృద్ధి సాధిస్తుందని తాను అంచనా వేయలేదని తెలిపారు. భారత ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.   ‘‘ఇప్పుడు, భారత్‌, చైనా

స్వల్ప నష్టాలతో ముగింపు

Monday 16th December 2019

ఇంట్రాడే కొత్త ఆల్‌టైం హైని అందుకున్న సెన్సెక్స్‌  12100 స్థాయిని చేజార్చుకున్న నిఫ్టీ  ఐటీసీ, మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు  ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమయ్యాయి. ట్రేడింగ్‌లో ప్రారంభంలో సెన్సెక్స్‌ కొత్త రికార్డు గరిష్టాన్ని నమోదు చేసినప్పటికీ.., మార్కెట్ ముగిసే సరికి 71 పాయింట్లు నష్టపోయి 40938 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 12100 స్థాయిని చేజార్చుకొని 32.70 పాయింట్లు నష్టంతో 12054 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఎఫ్‌ఎంసీజీ, అటో, మెటల్‌ రంగాలకు

Most from this category