News


యస్‌బ్యాంక్‌ 73శాతం జంప్‌..!

Tuesday 17th March 2020
Markets_main1584424358.png-32527

  • మూడీస్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ 
  • కలిసొచ్చిన ట్రేడింగ్‌పై ఆంక్షలు..!

ప్రైవేట్‌ రంగ బ్యాంకు యస్‌బ్యాంక్‌ షేరు ధర మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 73శాతం ర్యాలీచేసింది.రేటింగ్‌ ఏజెన్సీ యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు యస్‌బ్యాంక్‌ ట్రేడింగ్‌ ఆంక్షలు విధించడటం ఇందుకు కారణమాయ్యయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు మునుపటి ముగింపు ధర(రూ.37.10)తో పోలిస్తే 10లాభంతో రూ.40.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తాజాగా యస్‌బ్యాంక్‌లో ఆర్‌బీఐతో పాటు పలు ప్రైవేట్‌రంగ బ్యాంకులు పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యలో ధీర్ఘాకాలిక పారెన్స్‌ కరెన్సీ ఇష్యూయర్‌తో పాటు కరెన్సీ సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ ఎంటీఎస్‌ ప్రో‍గ్రామ్‌ రేటింగ్‌ను సీఏఏ3 నుంచి సీఏఏ1కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు మూడీస్‌ రేటింగ్‌ సంస్థ సోమవారం ప్రకటించింది. 

మరోవైపు యస్‌బ్యాంక్‌ షేర్లను కలిగిన ఉన్న ఇన్వెస్టర్లు తమ ఉన్న మొత్తం యస్‌బ్యాంక్‌ షేర్లలో పాతిక శాతానికి మించి షేర్లను విక్రయించకూడదని ఆర్‌బీఐ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. 

ఈ పరిణామాల నేపథ్యంలో నేడు యస్‌బ్యాంక్‌ షేరు ఒకదశలో 73శాతం లాభపడి రూ.64.15 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు షేరు నిన్నటి ముగింపు ధర(రూ.37.10)తో పోలిస్తే 53శాతం లాభంతో రూ.56.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.5.55లు, రూ.285.90గా నమోదయ్యాయి. 

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యస్‌బ్యాంక్‌ గట్టెక్కించేందుకు ఎస్‌బీఐతో ఏడు బ్యాంకులు రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన తరుణంలో ఈ బ్యాంక్‌ షేరు గడిచిన 3ట్రేడింగ్‌ సెషన్‌ల్లో ఏకంగా 151శాతం ర్యాలీ చేసింది. 

పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్‌బ్యాంక్‌పై మారిటోరియం తొలిగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. అలాగే అవరసరమైతే రిజర్వ్‌ బ్యాంక్‌ అదనంగా లిక్విటి సపోర్ట్‌ చేస్తుందని అభయమిచ్చారు.



You may be interested

ఏడాది కనిష్టానికి 259 షేర్లు

Tuesday 17th March 2020

మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 259 షేర్లు పడిపోయాయి.వీటిలో 21 ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆర్వీ డెనిమ్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, ఆగ్రోఫోస్‌ ఇండియా, ఆక్స్ ఆఫ్టీఫైబర్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అన్సల్‌ హౌసింగ్‌, ఆర్కిస్‌, ఆర్కోటెక్‌, అరిహంత్‌ ఫౌండేషన్స్‌ అండ్‌ హౌసింగ్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, ఆశియానా హౌసింగ్‌, అట్లాంటా,

ఇండియా సిమెంట్స్‌ జోరు- దమానీ దన్ను

Tuesday 17th March 2020

ఇండియా సిమెంట్స్‌పై డీమార్ట్‌ ప్రమోటర్ల ఆసక్తి తాజాగా 4 శాతం వాటా కొనుగోలు ఇండియా సిమెంట్స్‌లో 16 శాతానికి  దమానీ వాటా ఇటీవల కొద్ది రోజులుగా దక్షిణాది కంపెనీ ఇండియా సిమెంట్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తున్న రాధాకిషన్‌ దమానీ తాజాగా 4 శాతం వాటాను కొనుగోలు చేశారు. దీంతో ఇండియా సిమెంట్స్‌లో ప్రస్తుతం డీమార్ట్‌ స్టోర్ల ప్రమోటర్‌ దమానీ కుటుంబం వాటా 16 శాతానికి ఎగసింది. ఈ వార్తల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్‌

Most from this category