News


యస్‌ బ్యాంకు విషయంలో ఏం చేయొచ్చు?

Tuesday 2nd July 2019
Markets_main1562090822.png-26746

ప్రైవేటు రంగంలో ఐదో అతిపెద్ద బ్యాంకు, యస్‌ బ్యాంకు. ఏడాది క్రితం వరకు యస్‌ బ్యాంకు పరిస్థితి బాగానే ఉంది. బ్యాంకు సారథిగా ‍వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ కొనసాగడానికి వీల్లేదంటూ ఆర్‌బీఐ పెట్టిన ఆంక్షలతో బ్యాంకుకు సమస్యలు మొదలయ్యాయి. ఖాతాల్లో ఎన్‌పీఏలను తగ్గించి చూపించిందన్న ఆరోపణలు రావడం, రాణా కపూర్‌ పదవీ కాలం పొడిగింపునకు ఆర్‌బీఐ నో చెప్పడంతో ఈ స్టాక్‌ రూ.404 గరిష్ట ధర నుంచి పడిపోవడం మొదలైంది. కొత్త సారథిగా రవనీత్‌గిల్‌ను యస్‌ బ్యాంకు బోర్డు ఎంపిక చేసుకున్న తర్వాత షేరు 52 వారాల కనిష్ట ధర నుంచి రూ.284 వరకు వెళ్లింది. కానీ, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాల్లో ఎన్‌పీఏలకు భారీగా చేసిన కేటాయింపులు, పెరిగిన ఎన్‌పీఏలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం, ఫలితంగా ఆ షేరు ధర రనూ.100కు దిగొచ్చింది. ఈ పరిస్థితుల్లో యస్‌ బ్యాంకు షేరు విషయంలో ఏం చేయాలన్న అయోమయం వాటాదారుల్లో నెలకొంది. దీనిపై ప్రముఖ నిపుణుడు, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీంజీవ్‌ భాసిన్‌ విలువైన అభిప్రాయాలు తెలియజేశారు.  

 

‘‘యస్‌ బ్యాంకు నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉంది. యస్‌ బ్యాంకు స్టాక్‌ను ఇన్వెస్టర్లు ఇంకా బలహీన వికెట్‌గానే చూస్తున్నారు. బేర్స్‌ ఈ స్టాక్‌పై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. యస్‌ బ్యాంకు స్టాక్‌ను పోగు చేసుకోవడానికి ఇది సమయం. అయితే, 50 శాతం పెట్టుబడిని పక్కన ఉంచుకోవాలి. బ్యాంకు నిధులను సమకీరించిన రోజు ఇన్వెస్ట్‌ చేయడం కోసం సగాన్ని రెడీగా ఉంచుకోవాలి. నిధులు సమీకరించిన రోజు ఈ స్టాక్‌ కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నట్టే. ఇప్పుడైతే స్టాక్‌ ధర రూ.90 లేదా రూ.120 అన్నది నాకు తెలియదు. ప్రభుత్వ రంగ బ్యాంకులే రీక్యాపిటలైజేషన్‌తో మంచి పనితీరు చూపుతున్నప్పుడు, రూ.23,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన యస్‌ బ్యాంకు సులభంగానే నిధులు సమీకరించగలదు. దాంతోఈ నిరాశ అంతా తొలగిపోతుంది. 

 

నూతన సారథి (రవనీత్‌ గిల్‌) రావడంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అది సానుకూలం. లోపాలు చాలా వరకు బయటకు వచ్చేశాయి. ప్రొవిజన్లు అధికంగా ఉన్నాయి. వాచ్‌లిస్ట్‌లో రూ.10,000 కోట్ల రుణాలను చేర్చారు. అయితే, స్టాక్‌ ధర రూ.105 లేదా రూ.102 కానీయండి. ఈ ‍స్థాయి నుంచి ఏడాది చివరికి 30 శాతం పెరిగేందుకు సిద్ధం కావాల్సిందే. ఏడాదిన్నర క్రితం యాక్సిస్‌ బ్యాంకు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నది. రూ.480-500 స్థాయిలో బ్రెయిన్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు పెట్టింది. ఈ రోజు యాక్సిస్‌ ఎక్కడ ఉందో చూడండి. యస్‌ బ్యాంకు సులభంగానే నిధులు సమీకరించగలదు’’ అని భాసిన్‌ వివరించారు.You may be interested

మరో పాజిటివ్‌ ఓపెనింగ్‌

Wednesday 3rd July 2019

 ఆసియా మార్కెట్లు క్షీణతతో ట్రేడవుతున్నా, మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న నేపథ్యంలో బుధవారం భారత్‌ సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా ఆరంభంకావడం వరుసగా ఇది మూడో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 91 పాయింట్ల పెరుగుదలతో 39,907 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 11,932 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బీపీసీఎల్‌, ఐఓసీ, ఆసియన్‌ పెయింట్స్‌, గ్రాసిమ్‌, యస్‌బ్యాంక్‌లు స్వల్పలాభంతో ప్రారంభంకాగా, ఐషర్‌ మోటార్స్‌,

మిడ్‌క్యాప్‌ ర్యాలీ మొదలైతే ఎక్స్‌ప్రెస్సే: గౌతంషా

Tuesday 2nd July 2019

మిడ్‌క్యాప్‌ ఇప్పటికే బోటమ్‌ అవుట్‌ అయ్యాయని, లార్జ్‌క్యాప్‌లోనే దిద్దుబాటు జరగాల్సి ఉందన్నారు జేఎం ఫైనాన్షియల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ గౌతంషా. మార్కెట్‌ గమనంపై మాట్లాడుతూ... మే 23 ఎన్నికల ఫలితాల నుంచి మార్కెట్‌ గమనం అంత ప్రోత్సాహకరంగా లేదన్నారు. మార్కె్ట్‌ ర్యాలీ చేసిన ప్రతీ సారీ దిద్దుబాటుకు గురవుతోందని, అలాగే, స్వల్పంగా పడిపోయిన ప్రతీసారి ఎంతో మూమెంటమ్‌ ఉంటున్నట్టు చెప్పారు. మార్కెట్‌ పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. మధ్య కాలానికి మాత్రం

Most from this category