News


రెండోరోజూ యస్‌ బ్యాంక్‌ పతనం

Tuesday 3rd December 2019
Markets_main1575366580.png-30029

యస్‌బ్యాంక్‌ షేరు వరుసగా రెండోరోజూ నష్టాల బాట పట్టింది. నిన్నటి ట్రేడింగ్‌లో 6శాతం నష్టపోయిన ఈ షేరు మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో మరో 6శాతం నష్టపోయింది. అమెరికాకు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఈ బ్యాంకులో 120 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందనే వార్తలు షేరుకు ర్యాలీకి తోడ్పానివ్వలేకపోయాయి. యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న 8పెట్టుబడిదారులలో క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఒకటి. అమెరికాలో నియంత్రణ ఆమోదం ఎదురుచూస్తుంది. అయితే యస్‌ బ్యాంకు షార్ట్‌లిస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు అందరికీ ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే విషయమై విశ్లేషకుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇదే షేరు నష్టపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్‌ విశ్లేషకలు భావిస్తున్నారు. అలాగే జేపీ హెల్త్‌కేర్‌ సుమారు రూ.189 కోట్ల మొండి బకాయిలను చెల్లించడంలో విఫలమవడంతో బ్యాంకు దివాళా స్మృతి చట్టం కింది ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ.., నేటి ట్రేడింగ్‌లో 7.41శాతం నష్టపోయి రూ.64.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు(రూ.59.30)తో పోలిస్తే 7శాతం నష్టంతో 6.50శాతం నష్టంతో రూ.59.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.05లు, రూ.285.90లుగా నమోదయ్యాయి. You may be interested

టారిఫ్‌ పెంపుతో ఎయిర్‌టెల్‌కు ప్రయోజనం!

Tuesday 3rd December 2019

ఫిచ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోనీ టెలికం రంగంలోని ప్రైవేట్‌ ఆపరేట్లరంతా ఒక్కమారుగా టారిఫ్‌లను పెంచారు. పెరిగిపోతున్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేందుకు టారిఫ్‌లు పెంచాల్సివచ్చిందని కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెంపు సరాసరిన 25- 40 శాతం ఉన్నా, నిజమైన పెరుగుదల ఆయా కస్టమర్లు తీసుకొనే ప్లాన్లపై ఆధారపడి ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోనీ చెప్పారు. కస్టమర్లు అధిక డేటా వాడకానికి ప్రాధాన్యమిస్తారా? లేక అధిక టారిఫ్‌ చెల్లింపునకు

ఈ స్టాకుల్లో పాజిటివ్‌ సిగ్నల్స్‌!

Tuesday 3rd December 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 45 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో  కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, హావెల్స్‌ ఇండియా, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, శ్రేయ్‌ఇన్‌ఫ్రా, ఎల్‌టీ ఫుడ్స్‌, రాడికో ఖైతాన్‌, ట్రెంట్‌, ఏబీబీ ఇండియా, లవబుల్‌ లింగరీ, జేకే లక్ష్మీ సిమెంట్‌ తదితరాలున్నాయి.

Most from this category