News


యస్‌బ్యాంక్‌ 12.50శాతం క్రాష్‌..!

Tuesday 10th December 2019
Markets_main1575966158.png-30152

కీలకమైన బోర్డు సమావేశానికి ముందు మంగళవారం యస్‌బ్యాంక్‌ షేరు 6.50 శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.55.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు జరిగే బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో బ్యాంకులో పెట్టుబడులకు ఆసక్తిని కనబరిచే రుణదాతుల ఆఫర్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా మూలధన నిధుల సమీకరణకు షేర్‌ హోల్డర్ల అనుమతులు తీసుకోనున్నారు. యస్‌బ్యాంక్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపుల ద్వారా 2 బిలియన్ల డాలర్ల నిధులను సమీకరిస్తుంది. అనేక విదేశీ, దేశీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు బ్యాంకులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో యుఎస్ కేంద్రంగా పనిచేస్తున్న  క్యాపిటల్ ఇంటర్నేషనల్ 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.

అలాగే డిస్కవరీ క్యాపిటల్‌ 50 మిలియన్‌ డాలర్లు, వార్డ్‌ ఫెర్రీ 30 మిలియన్‌ డాలర్లు, ఎస్‌పీజీసీ హోల్డింగ్స్‌, ఎర్విన్‌ సింగ్‌ బ్రైంచ్‌, 25 మిలియన్‌ డాలర్లు, రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా 25మిలియన్‌ డాలర్లు, ఆదిత్యా బిర్లా 25మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ అండ్‌ ఎర్విన్‌ సింగ్‌ బ్రైచ్‌ ఆఫర్లను బోర్డు తిరస్కరించినట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కూడా పెట్టుబుడులు పెట్టేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం గం.1:00లకు షేరు క్రితం ముగింపు (రూ.56.20)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.53.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.05 రూ.285.90లుగా నమోదయ్యాయి. 



You may be interested

యస్‌బ్యాంక్‌లో ఝన్‌ఝన్‌వాలా వాటా కొనుగోలు లేనట్లే!

Tuesday 10th December 2019

యస్‌బ్యాంకులో దాదాపు 2.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి వాటాలు కొనాలన్న ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా, తన ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్లే కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకు నిధుల సమీకరణ ప్లాన్స్‌పై సందేహాలు రాకేశ్‌ను వెనుకంజ వేసేలా ప్రేరేపించాయని అంచనా వేస్తున్నారు. రాకేశ్‌ తన భార్య రేఖా ఝన్‌ఝన్‌వాలా పేరుమీద యస్‌బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయాలని భావించినట్లు బిజినెస్‌లైన్‌ వెల్లడించింది. ఈ విషయమై ఈరోజు ఒక ప్రకటన చేయాలని రాకేశ్‌

54 స్టాకుల్లో బేరిష్‌ సంకేతాలు!

Tuesday 10th December 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 54 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్‌, బంధన్‌ బ్యాంక్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌, హావెల్స్‌ ఇండియా, ఫ్యూచర్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీగ్యాస్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ,

Most from this category