News


నిధుల సమీకరణపైనే యస్‌బ్యాంక్‌ మనుగడ

Tuesday 14th January 2020
Markets_main1578987908.png-30920

యస్‌బ్యాంక్‌ షేరుకు రూ.10వేల కోట్ల నిధుల సమీకరణ అంశం భరోసాను ఇవ్వలేకపోయింది. ఫలితంగా షేరు పతనం వరుసగా 3వ రోజూ కొనసాగుతుంది. బుధవారం మరో 8.50శాతం క్షీణించి మొత్తంగా 19శాతాన్ని నష్టపోయింది. జనవరి 10న జరిగిన బ్యాంకు బోర్డు సమావేశంలో డెట్‌, ఈక్విటీల ద్వారా రూ.10వేల కోట్ల నిధులను సేకరణకు ఆమోదం తెలిపింది. ఇర్విన్‌ సింగ్‌ బ్రెయిచ్‌/ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ ప్రతిపాదిత ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫర్‌తో కొనసాగకూడదని బోర్డు నిర్ణయించింది. సిటాక్స్‌ ఇన్వెస్ట్‌ గ్రూప్‌ 500డాలర్ల మిలియన్ల ఆఫర్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని తదుపరి సమావేశం పరిశీలించాలని బోర్డు భావిస్తోంది. నవంబర్‌లో కెనడియన్‌ ఇన్వెస్టర్‌ ర్విన్ సింగ్ బ్రైచ్. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఎస్‌పీజీ హోల్డింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సం‍స్థలు 1.2 బిలియన్ డాలర్ల ఆఫర్ల ప్రకటనతో ముందుకొచ్చిన తరుణంలో యస్‌ బ్యాంకు 2 బిలియన్ డాలర్ల వరకు మూలధన నిధుల్ని సమీకరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతవారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం నాడు బ్యాంక్‌ బోర్డు స్వతంత్ర సభ్యుడు, బ్యాంక్ ఆడిట్ కమిటీ అధిపతి ఉత్తమ్‌ ప్రకాష్ అగర్వాల్ రాజీనామా చేయడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరగడం, మూలధన నిధుల సమీకరణ అలసత్వం కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. ఫలితంగా షేరు గడచిన ఏడాది కాలంలో ఏకంగా 80శాతం నష్టాన్ని చవిచూసింది. 

యస్‌బ్యాంక్‌ ప్రస్తుతం సంస్థాగత సమస్యను ఎదుర్కోంటుంది. అయితే మునిగిపోతున్న నావగా ముద్రవేయడానికి వీలులేదు. దాని బలాలు దానికున్నాయి. సరైన ఖర్చుతో చట్టబద్ధమైన పద్ధతిలో నిధులను సేకరించడానికి బోర్డు తగిన చర్యలు తీసుకోవడం, అగర్వాల్ లేవనెత్తిన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడం ద్వారా బ్యాంకు కష్టాల నుంచి బయటపడవచ్చు. అయితే ప్రస్తుత బ్యాంకింగ్ రంగ పరిస్థితుల్లో ఇది అంత సులభం కాకపోవచ్చు అని ఇన్ట్సిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) మాజీ అధ్యక్షుడు అమర్జిత్ చోప్రా అభిప్రాయపడ్డారు. 

యస్‌బ్యాంక్‌ తన చరిత్రలో అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కోంటుంది. చరిత్రను పరిశీలించినట్లైతే ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోన్న ప్రైవేట్ బ్యాంకులకు మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. ఇటీవల కాలంలో షేరు బాగా పతనమైనప్పటికీ.., షేరుకు తిరిగి ఇప్పుడిప్పుడే కొనుగోలు మద్దతు లభించకపోవచ్చు. బ్యాంకు స్వతంత్ర డైరెక్టర్ రాజీనామా చేయడం, మూలధన సేకరణలో సుదీర్ఘ ఆలస్యం లాంటి అంశాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. సిటాక్స్‌ ఇన్వెస్ట్‌ గ్రూప్‌ 500 మిలియన్‌ డాలర్ల ఆఫర్‌ను పరిశీలిస్తామని బోర్డు తెలపడంతో దీర్ఘకాలంపాటు యస్‌బ్యాంకుతో కొనసాగాలనే ఇన్వెస్టర్లకు ఆశాజనకంగా మారిందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో యస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మూలధన సేకరణ చాలా కీలకం. రుణదాతలు పెట్టుబడులు పెట్టాలంటే పెండింగ్‌లో ఉన్న మెండిబకాయిలను గుర్తించడం, నాణ్యత ప్రమాణాలు సరిగా పాటించడం/మెరుగుపరచడంలాంటి అంశాలను పరిశీలించడంతో పాటుగా ఉన్నతస్థాయి యాజమాన్య స్థిరత్వం, ఉద్యోగుల నమ్మకాన్ని పునర్నిర్మించడం లాంటి వాటిని కొలమానం తీసుకుంటున్నారని బ్రోకరేజ్ తెలిపింది. You may be interested

చైనా కరెన్సీ మ్యానిప్యూలేటర్‌ కాదు..!

Tuesday 14th January 2020

స్పష్టం చేసిన అమెరికా గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ వాణిజ్య సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు అడుగులు పడుతున్న క్రమంలో చైనా ‘‘కరెన్సీ మ్యానిప్యూలేటర్‌’’ అనే ముద్రను అమెరికా  తొలగించింది. యువాన్‌ బలోపేతం అయిందని, చైనాను కరెన్సీ మ్యానిప్యూలేటర్‌గా పరిగణించడం లేదని అమెరికా ట్రెజరీ కాంగ్రెస్‌కు ఇచ్చిన సెమీ వార్షిక నివేదికలో పేర్కొంది. ఇక

2020లో జెఫరీస్‌ టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Tuesday 14th January 2020

కొత్త ఏడాది ప్రభుత్వ వ్యయం పెరగడం, కొత్త ఉత్పత్తుల లాంచింగ్‌, ముడిపదార్ధాల వ్యయాలు తగ్గడం, బలమైన బాలెన్స్‌ షీట్‌ కారణంగా మిడ్‌క్యాప్స్‌ పురోగతి చూపుతాయని ప్రముఖ బ్రోకరేజ్‌ జెఫరీస్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది కోసం టాప్‌ 3 మిడ్‌క్యాప్స్‌ను రికమండ్‌ చేస్తోంది. 1. సుప్రీం ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1218. బలాలు: వాల్యూ యాడెడ్‌ పోర్టుఫోలియో. జీఎస్‌టీ తర్వాత సంఘటిత రంగంలోని కంపెనీలకు డిమాండ్‌ పెరగడం,

Most from this category