News


9.50శాతం లాభపడ్డ యస్‌బ్యాంక్‌

Friday 8th November 2019
Markets_main1573198435.png-29448

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేరు శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా 9.50శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు​రూ.66.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఈ కంపెనీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒకదశలో 9.54శాతం పెరిగి రూ.72.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12:30లకు షేరు క్రితం ముగింపు(రూ.66.50)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.71.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.29.05, రూ.285.90లుగా నమోదయ్యాయి. మోర్గాన్‌స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) తాజాగా తన సూచీల్లో యస్‌బ్యాంక్‌ షేర్లను తొలగించిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 40.19 పాయింట్లు నష్టంతో 40613.55 వద్ద, నిఫ్టీ 16పాయింట్ల లాభంతో 11996.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

31000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 8th November 2019

మార్కెట్‌ ప్రారంభం ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా లాభాల బాట పట్టిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌ సెషన్‌ సమయానికి 31000 స్థాయికి ఎగిసింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,571.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌(3.75శాతం) లాభపడి జీవితకాల గరిష్టాన్ని అందుకోవడం, యస్‌బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 9శాతం నుంచి 4శాతం పెరగడం,

డీమెర్జర్‌ ప్రకటన.. రేమండ్‌ 20 శాతం అప్‌

Friday 8th November 2019

దేశీయ టెక్స్‌టైల్‌ దిగ్గజం రేమండ్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 20 శాతం మేర దూసుకుపోయింది. కంపెనీకి చెందిన లైఫ్‌స్టైల్‌ వ్యాపారాన్ని విడదీసి ప్రత్యేక సంస్థగా లిస్టింగ్‌కు తీసుకువస్తామని రేమండ్‌ ప్రకటించింది. దీంతో ఇకపై రేమండ్‌ రెండు కంపెనీలుగా మారనుంది. కొత్తగా ఏర్పడే కంపెనీ సంస్థకు కీలకమైన బ్రాండెడ్‌ టెక్స్‌టైల్స్‌, అపెరల్‌ వ్యాపారాన్ని చూసుకుంటుంది. పాత కంపెనీ కొత్తగా ఆరంభిస్తున్న రియల్టీ ప్రాజెక్టులు, ల్యాండ్‌ బ్యాంక్‌, ఇంజనీరింగ్‌, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలను చూసుకుంటుంది.

Most from this category