News


యస్‌బ్యాంక్‌ 10శాతం జంప్‌

Friday 26th July 2019
Markets_main1564131446.png-27330

ప్రైవేట్‌ రంగ బ్యాంకు యస్‌ బ్యాంకు షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌లో యస్‌బ్యాంక్‌ షేర్లు రూ.88.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా దేశపు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ టీపీజీ క్యాపిటల్‌, బ్రిటన్‌ దేశపు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషన్‌లు సంస్థలు యస్‌ బ్యాంకులో దాదాపు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఈ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా షేర్లు 10శాతం ర్యాలీ చేసి రూ.96.40ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.  యాజమాన్య నిర్వహణ లోపంతో ఇటీవల భారీగా నష్టపోయిన చవిచూసిన ఈ షేర్లు కనిష్ట ధర వద్ద లభిస్తుండంతో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు(రూ.87.65)తో పోలిస్తే 9శాతం లాభంతో రూ.95.60ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 షేర్లలో మొదటిస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 81.75  రూ.404.00లుగా నమోదయ్యాయి.



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం రూ.826 కోట్లు

Friday 26th July 2019

రూ.22,057 కోట్లకు మొత్తం ఆదాయం  నికర వడ్డీ మార్జిన్‌ 2.73 శాతం  21 శాతం వృద్ధి చెందిన రిటైల్‌ రుణాలు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌కు రూ.826 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.646 కోట్ల నికర లాభం ఆర్జించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ల విలీనం తర్వాత తాము వెల్లడిస్తున్న

అస్థిర పరిస్థితులలో లార్జ్‌ క్యాప్‌లను విడిచిపెట్టకండి

Friday 26th July 2019

‘కొన్ని బ్యాంకులు మంచి ఫలితాలను ప్రకటించడం గమనించాం. కానీ ప్రస్తుత పరిస్థితులు సమస్యగా ఉన్నాయి’ అని మోతిలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌ , రిటైల్ రీసెర్చ్ హెడ్, సిద్ధార్థ ఖేమ్కా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. లార్జ్‌ క్యాప్‌లను విడిచిపెట్టొద్దు.. ప్రస్తుత అస్థిర పరిస్థితులలో  నాణ్యమైన  లార్జ్‌క్యాప్‌లను ఎంచుకోవడం మంచిది. అలాగే ప్రస్తుత సమస్యాత్మక పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్స్‌ను విడిచిపెట్టడం కూడా మంచిదికాదు. ఇప్పటికే కొన్ని లార్జ్‌ క్యాప్‌

Most from this category