News


యస్‌బ్యాంక్‌16శాతం ర్యాలీ ..!

Wednesday 11th September 2019
Markets_main1568182273.png-28303

యస్‌బ్యాంక్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 8శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.66.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ కంపెనీ ఒకటి యస్‌బ్యాంక్‌లో స్వల్ప వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి వాస్తవమేని కంపెనీ చీఫ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, మేనేజింగ్‌ డెరెక్టర్‌ రవ్‌నీత్‌గిల్‌ వివరణ ఇచ్చారు. సదరు కంపెనీ బ్యాంక్‌లో 10శాతం వాటాకు మించుకుండా కొనుగోలు చేస్తుందని, ఇప్పటికి వరకు ఎలాంటి బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టలేదని గిల్‌ చెప్పుకొచ్చారు. అయితే వాటాలు కొనుగోలు చేస్తున్న కంపెనీ పేరును బయటపెట్టడానికి ఆయన నిరాకరించారు. క్యూఐపీ పద్ధతిలో బ్యాంక్‌ ఆగస్ట్‌లో రూ.1,930 కోట్ల నిధుల సమీకరించింది. మరో రెండు నెలల్లో ఫ్రిపరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్దతిలో 2.5బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణకు బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. వాటా కొనుగోలు వార్తల నేపథ్యంలో ఈ బ్యాంక్‌ షేర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఒకదశలో 15శాతం పెరిగి రూ.72.55ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు షేరు క్రితం ముగింపు(రూ.63.1)తో పోలిస్తే 13శాతం లాభంతో రూ.71.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.53.15 రూ.348.25లుగా నమోదయ్యాయి.



You may be interested

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనొచ్చు!

Wednesday 11th September 2019

కమోడిటీ నిపుణుల సూచన పోర్టుఫోలియోలో బంగారం కూడా ఉండాలనుకునే ఇన్వెస్టర్లు 2019-20 సీరిస్‌4 సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బాండ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌కు ఓపెన్‌గా ఉన్నాయి. వారాంతం వరకు వీటికి సబ్‌స్క్రైబ్‌ కావచ్చు. వీటికి డిజిటల్‌ రూపంలోనైతే గ్రాముకు రూ.3840, భౌతిక చెల్లింపులైతే గ్రాముకు రూ. 3890 చొప్పున చెల్లించాల్సిఉంటుంది. ప్రస్తుతం యూఎస్‌ మార్కెట్లు పదేళ్ల బుల్‌రన్‌ చివరి సంవత్సరంలో ఉన్నాయని, చాలా ఓవర్‌

నిఫ్టీలో షార్ట్స్‌ వద్దు!

Wednesday 11th September 2019

నిపుణుల సూచన నిఫ్టీ టెక్నికల్‌ సెటప్‌ చూస్తే బేరిష్‌ నుంచి బుల్లిష్‌ ట్రెండ్‌లోకి మారినట్లు కనిపిస్తుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో కొత్త షార్ట్స్‌ వద్దని, కావాలంటే లాంగ్స్‌ పరిశీలించవచ్చని సలహా ఇస్తున్నారు. లాంగ్స్‌కు 10787పాయింట్లను స్టాప్‌లాస్‌ను పెట్టుకోవాలని సూచించారు. ఐదు వారాలుగా నిఫ్టీ 10750- 11100 పాయింట్ల రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతోంది. దిగువన నిఫ్టీ వంద రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందుతోంది. నిఫ్టీకి 11142- 11181

Most from this category