STOCKS

News


కుమార్తెల కోసం తనఖా..యస్‌ బ్యాంక్‌ 4 శాతం పతనం

Tuesday 23rd July 2019
Markets_main1563860169.png-27245

 రానా కపూర్‌ తన కుమార్తెల వెంచర్లకు సెక్యురిటీగా తన యస్‌ బ్యాంక్‌ షేర్లను తనఖా పెట్టారు. తన కుమార్తెలు రాధా ఖన్నా, రాఖే టాండన్, రోషిని కపూర్ యాజమాన్యంలో ఉన్న మోర్గాన్‌ క్రెడిట్స్‌ సంస్థకు అసురక్షిత రుణాలు ఉన్నాయని కపూర్ తెలిపారు. ‘నా కుమార్తెల వ్యవస్థాపక ప్రయత్నాల కోసం యస్‌ బ్యాంక్‌లో ఉన్న నా సొంత వాటాలను తనఖాగా పెట్టాను’ అని కపూర్ వివరించారు. అంతేకాకుండా మోర్గాన​ క్రెడిట్స్‌ సంస్థ కూడా యస్‌ బ్యాంక్‌లో ఉన్న తమ వాటాలోని కొంత భాగాన్ని తనఖా పెట్టింది. 
    ప్రమోటర్లు తమ వాటాలో కొంత భాగాన్ని తాకట్టు పెట్టడంతో మంగళవారం యస్‌ బ్యాంక్‌ షేరు​ విలువ 4 శాతం నష్టపోయింది. యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ రానా కపూర్‌ తన వాటాలో 4.31 శాతం అనగా 10 కోట్ల షేర్లను సెక్రూరిటీ డిపాజిట్‌గా తాకట్టు పెట్టారని మంగళవారం యస్‌ బ్యాంక్‌ తెలిపింది. అంతేకాకుండా రానా కపూర్‌ కుమార్తెల ఆధినంలో ఉన్న మోర్గాన్ క్రెడిట్స్ సంస్థ కూడా తమ వాటాలో 3.03 శాతం అనగా 7.02 కోట్ల షేర్లను తాకట్టు పెట్టారని బిఎస్‌ఈ ఫైలింగ్‌లో యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. మొత్తంగా 2019 జూలై 18-22 మధ్య కాలంలో ప్రమోటర్లు 7.34 శాతం వాటాను తాకట్టు పెట్టారని  కం‍పెనీ  పేర్కొంది. ప్రమోటర్ సంస్థైన  మోర్గాన్ క్రెడిట్స్ (ఎంసిపిఎల్) జారీ చేసిన డిబెంచర్ల కోసం సెక్యూరిటీగా వీటిని తాకట్టు పెట్టారు. ఎంసీపీఎల్‌ జారీ చేసిన డిబెంచర్లను కలిగి ఉన్నవారి ప్రయోజనం కోసం వారు డిబెంచర్ ట్రస్టీ అయిన మైలుస్టోన్‌ ట్రస్టీషిప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుకూలంగా ఈ చర్యను తీసుకున్నారు. జూన్ 2019 చివరినాటికి ఈ  బ్యాం‍క్‌లో ప్రమోటర్ వాటా 19.78 శాతంగా ఉంది. అందులో రానా కపూర్, అతని భార్య వాటా 11.88 శాతంగా ఉంది. 
యస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11 గంటల సమయానికి 1.81 శాతం లాభపడి రూ.92.80 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

డాలర్‌ రికవరీ: నష్టాల్లో పసిడి

Tuesday 23rd July 2019

ప్రపంచమార్కెట్లోని పసిడి ధర మంగళవారం 9డాలర్ల మేర నష్టపోయింది. డాలర్‌ బలపడటంతో పాటు ట్రేడర్ల లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,425.55డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ వరుసగా మూడోరోజూ రికవరీ కావడంతో పాటు వారం రోజుల గరిష్టాన్ని అందుకోవడంతో పసిడి ఫ్యూచర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల భారీ కోతను అరశాతంగా

కొత్త జీవితకాల గరిష్టానికి ఇన్ఫోసిస్‌

Tuesday 23rd July 2019

కలిసొచ్చిన రూపాయి బలహీనత దేశీయ ఐటీ సేవల దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.785.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ 12 పైసలు నీరసించడంతో ఐటీ కంపెనీల షేర్లకు కలిసొస్తుంది. అందులో భాగంగా నేడు ఇన్ఫోసిస్‌ షేర్లు దాదాపు 2.50శాతం మేర

Most from this category