News


యస్‌బ్యాంక్‌ 6 శాతం క్రాష్‌

Thursday 30th January 2020
Markets_main1580364837.png-31331

  • ‘‘ నెగిటివ్‌ వాచ్‌’’ కొనసాగింపుతో అమ్మకాలు

యస్‌బ్యాంక్‌ బ్యాంక్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 5శాతం నష్టాన్ని చవిచూసింది. ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్రోకరేజ్‌ సంస్థ గతంలో ఇచ్చిన నెగిటివ్‌ వాచ్‌తో కూడిన ధీర్ఘకాలిక రేటింగ్‌ ‘‘ఎ’’ను కొనసాగించడంతో పాటు స్వల్పకాలికి కేటియించిన A1 రేటింగ్‌ను ఉపసంహరించుకునట్లు బుధవారం యస్‌బ్యాంక్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు మునుపటి ముగింపు(రూ.41.20)తో పోలిస్తే 1శాతం నష్టంతో రూ.40.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేర్లు అమ్మకాలకు మొగ్గచూపడంతో ఒకదశలో 6శాతం నష్టపోయి రూ.38.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.రూ.41.20)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.39.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.05లు, రూ.285.90లుగా నమోదయ్యాయి. ఈక్విటీ పెంపు కోసం యస్‌ బ్యాంక్‌ చేస్తున్న పరిణామాలు బ్రోకరేజ్‌ సంస్థ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 30th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా స్టాక్‌మార్కెట్‌లో గురువారం ప్రభావితమయ్యే షేర్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ బ్యాంక్‌ ఇటీవల విలీనం అయ్యి ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ డిసెంబర్‌ 31తో ముగిసిన  క్యూ3 నికర నష్టం రూ.1,639 కోట్లుగా ప్రకటించింది. కాగా గతేడాది నికర నష్టం రూ.2,504 కోట్లుగా ఉంది. కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌:  గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో ఆడిట్‌ చేయని

ఈ షేర్లు 52 వారాల గరిష్టం

Thursday 30th January 2020

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించనుండటం, జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. దీనికితోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై అంతర్జాతీయంగా నేడు అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలు సైతం ఆందోళనలు పెంచాయి. దీంతో  ఒక్కరోజులోనే తిరిగి ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా నేలచూపులతో ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత నీరసించాయి. ఉదయం 11 ప్రాంతంలో సెన్సెక్స్‌ 222 పాయింట్లు క్షీణించి

Most from this category