News


1484 శాతం ఎగసిన యస్‌ బ్యాంక్‌

Wednesday 18th March 2020
Markets_main1584506556.png-32552

తాజాగా 23 శాతం హైజంప్‌
రూ. 72ను అధిగమించిన షేరు
ఇంట్రాడేలో రూ. 87ను దాటేసింది
నేటి సాయంత్రం నుంచి పూర్తి కార్యకలాపాలు

ఖాతాదారులు మొత్తం రూ. 50,000కు మించి ఉపసంహరించుకునే వీలులేకుండా యస్‌ బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన నిషేధం నేటి(బుధవారం) సాయంత్రం 6 తదుపరి తొలగిపోనుంది. దీంతో ఖాతాదారులకు యస్‌ బ్యాంక్‌ పూర్తిస్థాయి కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ అంశంపై యస్‌ బ్యాంక్‌ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్‌బీఐ మాజీ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఇటీవల అనూహ్య ర్యాలీ చేస్తున్న యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ పెరిగింది. వెరసి ఉదయం 10 ప్రాంతంలో యస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 23 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 72 ఎగువన ట్రేడవుతోంది. 

ఇదీ జోరు తీరు
నిజానికి యస్‌ బ్యాంక్‌ కార్యకలాపాలపై ఏప్రిల్‌ 6వరకూ రిజర్వ్‌ బ్యాంక్‌ నిషేధాన్ని విధించింది. అయితే ప్రశాంత్‌ కుమార్‌ నేతృత్వంలో బ్యాంకు కార్యకలాపాలను గాడిన పెట్టేందుకు నిర్ణయించుకున్నాక మారటోరియంను ఈ నెల 18 సాయంత్రం నుంచి ఎత్తివేసేందుకు నిర్ణయించింది. కాగా.. ప్రశాంత్‌ కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటుకానున్న బోర్డు ఈ నెల 26 నుంచి బాధ్యతలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా 1132 బ్రాంచీల ద్వారా నేటి సాయంత్రం నుంచి పూర్తి కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నట్లు ప్రశాంత్‌ కుమార్‌ మంగళవారం పేర్కొన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న నమోదైన రికార్డ్‌ కనిష్టం రూ. 5.55 నుంచి యస్‌ బ్యాంక్‌ షేరు యూటర్న్‌ తీసుకుంది. లాభాల బాటలో సాగుతూ ఏకంగా 1484 శాతం దూసుకెళ్లింది. తాజాగా రూ. 72 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో ఏకంగా రూ. 87ను సైతం అధిగమించడం విశేషం!
 



You may be interested

లాభాలతో షురూ- 9,100ను దాటిన నిఫ్టీ

Wednesday 18th March 2020

31,000 పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్‌ ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే ఎట్టకేలకు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వెనువెంటనే జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే నిఫ్టీ 130 పాయింట్లు, సెన్సెక్స్‌ 425 పాయింట్లు చొప్పున ఎగశాయి. 9.20కల్లా సెన్సెక్స్‌ 436 పాయింట్లు పురోగమించి 31,015ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 136 పాయింట్లు జంప్‌చేసి 9,103కు చేరింది. వెరసి సెన్సెక్స్‌ 31,000 పాయింట్ల మైలురాయిని

ట్రంప్‌ కార్డ్‌- యూఎస్‌ జోష్‌

Wednesday 18th March 2020

5 శాతం జంప్‌చేసిన ఇండెక్సులు ఫెడరల్‌ రిజర్వ్‌ లిక్విడిటీ బూస్ట్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సహాయక చర్యల దన్ను ఫైజర్‌, రీజెనరాన్‌ ఫార్మా హైజంప్‌ కరోనా ప్రభావానికి చెక్‌ పెట్టే బాటలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించిన సహాయక చర్యలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. దీంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 5 శాతం జంప్‌చేశాయి. ఇప్పటికే కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఏకంగా జీరో(0-0.25 శాతం) స్థాయికి దించడంతోపాటు.. 700 బిలియన్‌ డాలర్ల బాండ్ల

Most from this category