News


యస్‌ బ్యాంకు షేరు.. ఏం చేయవచ్చు..?

Thursday 23rd January 2020
Markets_main1579804055.png-31146

యస్‌ బ్యాంకును విఫలం కానీయకూడదంటూ ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ దావోస్‌లో చేసిన వ్యాఖ్యలు.. ఈ షేరు పట్ల ఇన్వెస్టర్లలో మరోసారి ఆసక్తికి దారితీశాయి. దీంతో గురువారం యస్‌బ్యాంకు షేరు 6.5 శాతం లాభపడి బీఎస్‌ఈలో రూ.40.95 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 8 శాతం వరకు ర్యాలీ చేసింది. వరుసగా రెండో రోజూ ఈ స్టాక్‌ లాభంతో క్లోజయింది. తాజా పరిణామంతో యస్‌ బ్యాంకు షేరులో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు నిపుణుల అభిప్రాయాలను ఒకసారి పరిశీలించడం మంచిదే.

 

ఒకానొక పెద్ద ప్రైవేటు బ్యాంకు ఫెయిలైతే అది భారత ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదంటూ కుమార్‌ పేర్కొనడం గమనార్హం. ఈ స్థాయి బ్యాంకును విఫలం కానీయరాదని, కొన్ని పరిష్కారాలు తప్పక కనిపిస్తాయని కుమార్‌ వ్యాఖ్యానించారు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు చీఫ్‌ ఈ విధంగా వ్యాఖ్యానించడం యస్‌ బ్యాంకు స్టాక్‌కు జోష్‌నిచ్చింది. ఫిబ్రవరి 7న వాటాదారుల అసాధారణ సమావేశాన్ని యస్‌ బ్యాంకు ఏర్పాటు చేసింది. నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం తీసుకోనుంది. ఇన్వెస్టర్ల దృష్టి ఈ సమావేశంపై నెలకొని ఉంది.

 

‘‘యస్‌ బ్యాంకుకు పెట్టుబడిదారుల కొరత లేదన్న విశ్వాసం ఎస్‌బీఐ చైర్మన్‌ మాటల్లో వ్యక్తమైంది. త్వరలోనే కొంత నిధులను బ్యాంకు సమీకరిస్తుందని అంచనా వేస్తున్నాం. ఒక్కసారి నిధుల సమీకరణ జరిగితే పరిస్థితులు కుదుటపడతాయి. దాంతో యస్‌ బ్యాంకు ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు తగినంత మంది ముందుకు వస్తారు’’ అని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ పేర్కొన్నారు. యస్‌ బ్యాంకును ఆదుకునేందుకు ఎస్‌బీఐ రంగంలోకి దిగుతుందా..? అన్న దానిపై మార్కెట్‌ పరిశీలకుల నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎస్‌బీఐ లేదా కోటక్‌ మహీంద్రా బ్యాంకు యస్‌ బ్యాంకులో వాటా తీసుకోవచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ వ్యవస్థాపకుడు సమీర్‌కల్రా అయితే.. యస్‌ బ్యాంకు నుంచి నిర్దిష్ట ప్రకటన వచ్చే వరకు ఏదైనా సాధ్యమేనన్నారు. బ్యాంకు ఈజీఎం ఫిబ్రవరి 7న ఉందని, ఆ లోపు ఓ ప్రకటన వెలువడవచ్చని అన్నారు. యస్‌ బ్యాంకుకు హోల్డ్‌ రేటింగ్‌ ఇచ్చారు. బ్యాంకు నిధుల సమీకరణ తర్వాత ఫలితాలు చూసి తమ రేటింగ్‌ను సమీక్షిస్తామని చెప్పారు.

 

నిధుల సమీకరణే కాదు.. డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల పట్ల కూడా ఇన్వెస్టర్లలో అప్రమత్తత నెలకొని ఉంది. ఎందుకంటే బ్యాంకు టైర్‌-1 క్యాపిటల్‌ ఆర్‌బీఐ నిర్దేశించిన కనీస స్థాయికి సమీపంలోనే ఉంది. డిసెంబర్‌ క్వార్టర్లో రుణ ఆస్తుల నాణ్యత, కొత్త ఎన్‌పీఏలు, వాటికి కేటాయింపుల గణాంకాలు చూసిన తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం మెచ్యూర్డ్‌ ఇన్వెస్టర్లలో ఉంది. ఎందుకంటే చాలా బ్రోకరేజీలు యస్‌ బ్యాంకు ఫలితాలు మెప్పించని విధంగానే ఉంటాయని అంచనా వేస్తుండడం గమనార్హం. వ్యాపార స్థిరీకరణ కొనసాగుతుందని, అధిక ఎన్‌పీఏలు మార్జిన్లపై ప్రభావం చూపుతాయని ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. అడ్వాన్సులు (రుణాల మంజూరు) వార్షికంగా డిసెంబర్‌ క్వార్టర్లో 8 శాతం, నికర వడ్డీ ఆదాయం 19 శాతం మేర తగ్గుతాయని నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా వేసింది.You may be interested

ఇల్లు చక్కదిద్దండి..!

Friday 24th January 2020

రుణాలు పునర్‌వ్యవస్థీకరించాలి స్టాంపు డ్యూటీ తగ్గించాలి పన్నులను హేతుబద్ధీకరించాలి గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలి రియల్టీ కోర్కెల చిట్టా..     దేశీయంగా రియల్టీ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే రంగాల్లో రెండో స్థానంలో ఉంటుంది. స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా సుమారు 10 శాతం. రియల్టీ రంగంలో కమర్షియల్‌ లీజింగ్, లావాదేవీల వృద్ధి మెరుగ్గానే ఉన్నా.. రెసిడెన్షియల్‌ రంగం అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రాజెక్టుల జాప్యం, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు కుదేలవడం తదితర

ఐడీఎఫ్‌సీ నుంచి స్మాల్‌క్యాప్‌ ఫండ్‌

Thursday 23rd January 2020

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ‘ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌’ పేరుతో స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో). ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు పెట్టుబడులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌వో క్లోజ్‌ అయిన తర్వాత ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ ఫండ్‌లో ఇన్వెస్టర్లు ఎందుకు పెట్టుబడులు పెట్టాలన్న దానికి ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ పలు కారణాలు కూడా తెలియజేసింది. ‘‘లార్జ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ కంపెనీల మధ్య

Most from this category