News


ఫలితాలు 14న- యస్‌ బ్యాంక్‌.. ‍కేక!

Wednesday 11th March 2020
Markets_main1583914436.png-32410

షేరు 30 శాతం జూమ్‌
ఇటీవలి కనిష్టం నుంచీ 424 శాతం అప్‌

సోమవారంనాటి భారీ పతనం నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. తొలుత స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే జోరందుకున్నాయి. మధ్యాహ్నం 1.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 331 పాయింట్లు బలపడి 35,966కు చేరగా.. నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 10,533 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 5 శాతం జంప్‌చేయడం, ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టడం వంటి అంశాలు మార్కెట్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడం కూడా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. వివరాలు చూద్దాం..

30 శాతం జూమ్‌
పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ మెజారిటీ(49 శాతం) వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో ఇటీవల కొద్ది రోజులుగా జోరు చూపుతున్న యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మధ్యాహ్నం 1.40 ప్రాంతంలో యస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 30 శాతం దూసుకెళ్లింది. రూ. 27.60 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 29.60 వరకూ ఎగసింది. వెరసి గత శుక్రవారం నమోదైన కనిష్టం రూ. 5.65 నుంచి చూస్తే.. యస్‌ బ్యాంక్‌ షేరు ఏకంగా 424 శాతం రికవరీ సాధించినట్లయ్యింది!!

14న ఫలితాలు
ఆర్థిక అవకతవకల్లో కూరుకున్న యస్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాల విడుదలను వాయిదా వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ యస్‌ బ్యాంక్‌ బోర్డును రద్దు చేయడంతోపాటు.. ఎస్‌బీఐ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ను పాలనాధికారిగా నియమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. తాజాగా ఈ నెల 14న క్యూ3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు బీఎస్‌ఈకి యస్‌ బ్యాంక్‌ సమాచారమిచ్చింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో మధ్యాహ్నానికల్లా 26.5 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇది బ్యాంక్‌ ఈక్విటీలో 10 శాతం వాటాకు సమానంకావడం గమనార్హం!!You may be interested

భయపడొద్దు- ఫార్మా, కెమికల్స్‌ బెస్ట్‌

Wednesday 11th March 2020

ఇన్వెస్టర్లు నాలుగు రకాలు మార్కెట్ల పతనాలలో అవకాశాలు ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై దృష్టిపెట్టండి - దీపన్‌ మెహతా, ఎలిగ్జిర్‌ వ్యవస్థాపకులు   కరోనా వైరస్‌ తదితర ఆందోళనల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. అయితే త్వరలోనే మార్కెట్లు బాటమవుట్‌ కానున్నాయంటున్నారు ఎలిగ్జిర్‌  ఈక్విటీస్‌ వ్యవస్థాపకులు దీపన్‌ మెహతా. విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరస్‌ను

ఎస్‌బీఐ కార్డ్స్ షేర్ల కేటాయింపు గురించి తెలుసుకోండిలా!

Wednesday 11th March 2020

ఎస్‌బీ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకున్న వారు తమకు షేర్లు వచ్చాయా? లేదో  అనే విషయాన్ని లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా అనే లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు దారు తమకు షేర్లు కేటాయించారో లేదో తెలుసుకోవాలంటే ముందుగా లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇన్వెస్ట్‌ర్‌ సర్వీసెస్‌ మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు అక్కడ సబ్‌ సెక్షన్‌లో పబ్లిక్‌ ఇష్యూ-ఈక్విటీస్‌లో ఈ వివరాలు

Most from this category