News


చిన్న ఇన్వెస్టర్ల చేతిలో యస్‌ బ్యాంక్‌

Wednesday 16th October 2019
Markets_main1571215947.png-28924

క్యు2లో షేరుపై పెరిగిన చిన్న ఇన్వెస్టర్ల ఆసక్తి
ఇటీవలి కాలంలో భారీగా పతనమైన యస్‌బ్యాంక్‌ షేరుపై చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొన్ని త్రైమాసికాలుగా బ్యాంకు పరిస్థితి బాగాలేదు, పేలవ ఫలితాలు ప్రకటిస్తూవస్తోంది. ఇలాంటి షేర్లలో సాధారణంగా హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లు రిస్కీ పెట్టుబడులు పెడుతుంటారు. కానీ ఈ షేరులో హెచ్‌ఎన్‌ఐలతో పోటీగా చిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులు యస్‌బ్యాంక్‌ కౌంటర్లో గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. ముఖ్యంగా క్యు2లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఈ షేరు దాదాపు 80 శాతం పతనమైంది. క్యు2లో రిటైల్‌ ఇన్వెస్టర్లు దాదాపు 26.40 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో హెచ్‌ఎన్‌ఐలు 2.53 కోట్ల షేర్లు కొన్నారు. దీంతో క్యు2లో బ్యాంకు వాటాదారుల్లో రూ.2 లక్షలలోపు పెట్టుబడి కలిగిన రిటైల్‌ వాటాదారుల షేర్ల సంఖ్య 69.80 కోట్లకు పెరిగింది. క్యు1లో ఇది 43.40 కోట్లు మాత్రమే ఉంది. వీరి వాటా శాతం 20.46 శాతం నుంచి 29.94 శాతానికి పెరిగింది. ఇక ఇతర ప్రధాన వాటాదారుల్లో ఎల్‌ఐసీ క్యు2లో యస్‌బ్యాంకులో తన వాటాను 8.87 శాతం నుంచి 8.06 శాతానికి తగ్గించుకుంది. ఎఫ్‌ఐఐల వాటా 33.69 శాతం నుంచి 26.51 శాతానికి తగ్గింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 6.59 శాతం నుంచి 9.26 శాతానికి పెరిగింది. 
రానా కపూర్‌ వాటా దాదాపు లేనట్లే..
క్యు2లో యస్‌బ్యాంక్‌ వాటాదారుల్లో వైయుక్తిక వాటాదారులు బడా స్టేక్‌హోల్డర్లుగా అవతరించారు. బ్యాంకు ప్రమోటర్లు దాదాపు తమ వాటాల్లో సగాన్ని విక్రయించుకున్నారు. క్యు2 చివరకు బ్యాంకు ప్రమోటర్‌ రానా కపూర్‌ వాటా 11.88 శాతం నుంచి 3.92 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్‌లో కపూర్‌కు చెందిన సంస్థలు తమ వాటాలను 6.29 శాతం నుంచి 0.80 శాతానికి తగ్గించుకున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం యస్‌బ్యాంకు వాటాలను వజ్రాలుగా రానా అభివర్ణించుకున్నారు. అలాంటిది ఏడాదిలో ఆయన తన వాటాలన్నీ దాదాపు అమ్మేసుకొని పోవడం గమనార్హం.


నిధుల సమీకరణ గట్టెక్కించేనా...
రుణ కష్టాల నుంచి గట్టెక్కేందుకు బ్యాంకు నిధుల సమీకరణకు పూనుకుంటోంది. తాజాగా ఫోర్టిస్‌ హెల్త్‌లో వాటాలను అమ్మి రూ. 645 కోట్లు సమీకరించుకుంది. బ్యాంకు భవిష్యత్‌ ఫండ్‌రైజింగ్‌ ఆధారంగా షేరుపై నిర్ణయం తీసుకుంటామని పలువురు నిపుణులు చెబుతున్నారు. రెండో రౌండ్‌ నిధుల సమీకరణ కొంత క్లిష్టమైన విషయమని, ఈ సారి వాటాలు కొనేందుకు వచ్చే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం వేచిచూడాల్సిఉంటుందని, అందువల్ల బ్యాంకుకు సాయం చేసేందుకు ఎవరు ముందుకు వస్తారో వేచిచూడాలని ప్రముఖ అనలిస్టు సమీర్‌ నారయణ్‌ చెప్పారు. ఇకపై స్టాకు కదలికలు ఎలాఉంటాయో ఇప్పుడే అంచనా వేయలేమని కేఆర్‌ చౌక్సీ గ్రూప్‌ ఎండీ దేవన్‌చౌక్సీ చెప్పారు. చిన్న ఇన్వెస్టర్లు ఈ షేరు మల్టీబ్యాగర్‌ అవుతుందన్న అంచనాలతో కొంటున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఇలా ఎగబడి కొనుగోలు చేసేకన్నా ముందు పలు విషయాలపై స్పష్టత కోసం వేచిచూడాలని సూచిస్తున్నారు. You may be interested

ఆల్‌ టైం గరిష్ఠానికి ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌

Wednesday 16th October 2019

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సురెన్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈ కంపెనీ సాక్‌పై అనేక బ్రోకరేజిలు బై సిఫార్సును ఇచ్చాయి. ఫలితంగా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో రూ. 892 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. కాగా ఈ కంపెనీ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 60 శాతానికిపైగా లాభపడడం గమనార్హం. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌  క్యూ2 ఫలితాలలో నికర లాభం 48.2

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 11 శాతం క్రాష్‌..!

Wednesday 16th October 2019

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు బుధవారం 11శాతం నష్టపోయాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.189.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీలో తలెత్తిన పాలనాపరమైన సమస్యల కారణంగా ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ సంస్థ మూడీస్‌ ఐబీహెచ్‌ఎఫ్‌ కంపెనీకి చెందిన సీఎఫ్‌ఆర్‌(కార్పోరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌), ఫారెన్స్‌-కరెన్సీ సీనియర్‌ సెక్యూర్డ్‌ రేటింగ్‌ను బీఎ2 నుంచి బీ2కు కుదించింది. ఫలితంగా నిన్న ట్రేడింగ్‌ కంపెనీ షేర్లు 4.50శాతం నష్టపోగా, నేటి ట్రేడింగ్‌లో కూడా అమ్మకాల

Most from this category