News


ఆగని యస్‌బ్యాంక్‌ షేర్ల పతనం

Friday 5th July 2019
Markets_main1562305258.png-26814

  • నేడు మరో 6.50శాతం క్షీణత

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ షేర్లు పతనం కొనసాగుతుంది. క్రితం రోజు 3.50శాతం నష్టపోయి ఈ బ్యాంకు షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6.50శాతం పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.95.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో 6.50శాతం నష్టపోయి రూ.90.25ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకున్నాయి. ఉదయం గం.10:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.96.25)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.92.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 90.25 రూ.404.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

ప్రభుత్వ రంగ కంపెనీ షేర్ల భారీ పతనం

Friday 5th July 2019

బడ్జెట్‌ రోజున ప్రభుత్వరంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయింది. నేడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణలో భాగంగా ఆయాఆయా ప్రభుత్వరంగ కంపెనీల్లో భారీ వాటా ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా నేటి బడ్జెట్‌ ప్రసంగానికి ముందే ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, ఐఓసీ, ఎన్‌ఎండీసీ,

బడ్జెట్‌ అప్‌డేట్‌-ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు

Friday 5th July 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.  -ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు

Most from this category