News


‘యస్‌’ ఏటీ-1 బాండ్‌హోల్డర్లకు ‘నో’

Sunday 15th March 2020
Markets_main1584296635.png-32488

యస్‌బ్యాంకు అడిషినల్‌ టైర్‌-1 (ఏటీ-1) బాండ్లలో రూ.8,415 కోట్ల పెట్టుబడులు పూర్తిగా రద్దు చేసినట్టేనని బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌కుమార్‌ స్పష్టతనిచ్చారు. ఇది మార్కెట్లకు రుచించని అంశమే. దీంతో ఏటీ-1 బాండ్లకు అమ్మకాల సెగ తప్పదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

ఏటీ1 సెక్యూరిటీలు అన్నవి అనిశ్చిత కన్వర్టబుల్‌ బాండ్స్‌. బ్యాంకు సంక్షోభంలో పడితే ఇన్వెస్టర్ల పెట్టుబడులు రిస్క్‌లో పడినట్టే. ‘‘ఇతర బ్యాంకుల నిధుల సమీరణ ప్రయత్నాలపై ఈ ప్రభావం పడుతుంది. ఈ బాండ్లను కలిగిన వారు రిస్క్‌ను మళ్లీ సమీక్షించుకుని అమ్మకాలకు దిగితే అది ధరల పతనానికి దారితీస్తుంది’’ అని ఎస్‌బీఐ డీఎఫ్‌హెచ్‌ఐ ఎండీ, సీఈవో ఎస్‌వీ శాస్త్రి తెలిపారు. యస్‌ బ్యాంకు ఏటీ1 బాండ్లను పూర్తిగా సున్నాకు రద్దు చేసేయడం బ్యాంకు పునర్నిర్మాణ ప్రణాళికలో భాగం. దీనిపై యస్‌ ట్రస్టీ, ఎల్‌అండ్‌టీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయి. కనీసం ఈక్విటీగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఫండ్స్‌ ఆర్‌బీఐని కోరాయి. దీంతో ఏదైనా పరిష్కారం లభించొచ్చన్న అంచనాలున్నాయి. కానీ, బాండ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌ ఇచ్చిన స్పష్టతతో సందేహాలన్నీ తీరినట్టే. ఇదే విషయాన్ని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు యస్‌ బ్యాంకు తెలియజేసింది. 

 

అయితే, యస్‌ బ్యాంకు ఏటీ1 బాండ్లను పూర్తిగా రద్దు చేయడంతో ఇతర బ్యాంకులు ఈ మార్గంలో నిధుల సమీకరణకు ద్వారాలు మూసుకుపోయినట్టేనని అంచనాలు వినిపిస్తున్నాయి. యస్‌ బ్యాంకు చర్యతో ఇప్పటికే ఇండస్‌ఇండ్‌ బ్యాంకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేసుకుంది. దీనికి ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులే కారణమని ఇండస్‌ఇండ్‌బ్యాంకు తెలిపింది. ఇక్రా గణాంకాల ప్రకారం.. దేశీయ బ్యాంకులు ఇష్యూ చేసిన ఏటీ1 బాండ్ల విలువ రూ.94,000 కోట్లు. టైర్‌-1 బాండ్ల కంటే ఏటీ1 బాండ్లలో రిస్క్‌ ఎక్కువ. ఏటీ1 బాండ్లను పూర్తిగా రద్దు చేయడం సరికాదని, వీటిని ఈక్విటీ కంటే తక్కువ సాధనాలుగా చూడడం పారదర్శకం కాదన్నది కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వాదన. అయితే, యస్‌ బ్యాంకు ఏటీ1 బాండ్లను రద్దు చేయడం ఇనిస్టిట్యూషన్స్‌కే కాదు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు కూడా మింగుడుపడనిదే. ఎందుకంటే కనీసం తమ పెట్టుబడిని అయినా ఇప్పించాలని కోరుతూ ఇప్పటికే రిటైల్‌ ఇన్వెస్టర్లలో కొందరు ఆర్‌బీఐని ఆశ్రయించారు. ఇందులో రిస్క్‌ గురించి తమకు చెప్పకుండా వీటిని అంటగట్టారంటూ వారు పేర్కొనడం గమనార్హం.You may be interested

భయపడి పారిపోవద్దు.. బలంగా నిలబడాలి

Sunday 15th March 2020

కష్టార్జితాన్ని తీసుకెళ్లి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి.. మార్కెట్లు పడిపోతున్నాయనే భయంతో వచ్చినంత చాల్లేననుకుని అమ్మేసుకుని బయటపడి పోదామనుకుంటే పెద్ద తప్పిదమే అవుతుంది. సూర్యాస్తమయం తర్వాత చీకటి వచ్చిందని భయపడిపోతే ఏమవుతుంది..? ఓపిక పడితే మళ్లీ సూర్యోదయం అవుతుంది. అలాగే, మార్కెట్‌ పతనాల్లో ధైర్యంగా నిలబడాలి. స్టాక్స్‌ను అమ్ముకోవడం కాకుండా.. పోర్ట్‌ఫోలియో పరంగా ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే అందుకు ఇటువంటి సందర్భాలను అనుకూలంగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి పతనాలను

ఈ ఫండ్స్‌లో రాబడుల పరిమళాలు

Sunday 15th March 2020

ప్రతికూల అంశాలతో మార్కెట్లు కుదేలవుతున్నాయి. చాలా రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులను గమనిస్తే గత మూడేళ్ల కాలంలో ఇచ్చిందేమీ లేదు. కానీ, ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌ కేటగిరీలను పరిశీలించినట్టయితే వాటిల్లో రాబడులు ఇన్వెస్టర్లు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ విభాగంలో కొన్ని ఫండ్స్‌ రెండంకెల రాబడులను గడిచిన ఏడాది కాలంలో ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.   బంగారం ఫండ్స్‌ విభాగం ఏడాది కాలంలో రాబడుల పరంగా అగ్ర స్థానంలో ఉంది. ఈ విభాగం

Most from this category