STOCKS

News


యస్‌ బ్యాంకు.. జోష్‌నివ్వని నిధుల సమీకరణ!

Tuesday 3rd December 2019
Markets_main1575312676.png-30006

యస్‌ బ్యాంకు 2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకున్నట్టు చేసిన ప్రకటన సోమవారం స్టాక్‌ ధరకు జోష్‌నివ్వలేకపోయింది. సగటు ధర ప్రకారం చూస్తే ఒక్కో షేరును రూ.77 ధర వద్ద కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కానీ, షేరు మాత్రం బీఎస్‌ఈలో 6 శాతానికి పైగా నష్టపోయి రూ.64.05 వద్ద క్లోజయింది. యస్‌ బ్యాంకు షార్ట్‌లిస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు అందరికీ ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే విషయమై విశ్లేషకుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇదే స్టాక్‌ నష్టపోవడానికి ప్రధాన కారణం. 2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ ప్రతిపాదనల్లో ఒక్క కెనడాకు చెందిన ఎర్విన్‌ సింగ్‌ బ్రైచ్‌ ఒక్కరే 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ముందుకు రావడం గమనార్హం. 10 శాతానికంటే అధికంగా ఒక ఇన్వెస్టర్‌ చేసే పెట్టుబడులకు ఆర్‌బీఐ అనుమతించకపోవచ్చన్న సందేహాలున్నాయి. 

 

‘‘2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ ప్రతిపాదనల్లో 180 మిలియన్‌ డాలర్లు ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి ఉన్నాయి. పెద్దగా తెలియని ఎస్‌పీజీపీ, సిటాక్స్‌ గ్రూపులు యస్‌ బ్యాంకులో పెట్టుబడుల పట్ల ఆసక్తితో ఉన్నట్టు మీడియాకు తెలిపాయి. వారి పెట్టుబడుల మూలాలు ఆర్‌బీఐ ‘ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ పరీక్షకు నిలబడతాయా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. నిధుల సమీకరణ ప్రతిపాదనకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపితే ఈ ఇన్వెస్టర్లకు బ్యాంకుల్లో భారీ వాటా ఉంటుంది’’అని నోమురా తెలిపింది. ఏదేనీ దేశీయ బ్యాంకులో 5 శాతానికి మించి వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ ఆమోదం అవసరం. ఆర్థికేతర సంస్థ అయితే ఒక బ్యాంకులో 10 శాతం వరకు గరిష్టంగా, అదే ఆర్థిక సంస్థ అయితే గరిష్టంగా 15 శాతం వరకు వాటాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. భారీ నిధుల సమీకరణ బ్యాంకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని, అయితే ఈ ఇన్వెస్టర్ల నాణ్యతపైనే సందేహం ఉందని నోమురా పేర్కొంది. పెట్టుబడులకు ఆసక్తి చూపించిన వాటిల్లో జీఎంఆర్‌ గ్రూపు (50 మిలియన్‌ డాలర్లు), ఆదిత్య బిర్లా ఫ్యామిలీ (25 మిలియన్‌ డాలర్లు), రేఖ జున్‌జున్‌వాలా (25 మిలియన్‌ డాలర్లు) కూడా ఉన్నారు. 

 

వీరిలో ఎర్విన్‌సింగ్‌ మినహా మరే ఇతర ఇన్వెస్టర్‌ కూడా వ్యూహాత్మకంగా కనిపించడం లేదని శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారిలో ఎక్కువ మంది పడిపోయిన స్టాక్‌ ధరను అనుకూలంగా భావించి ముందుకు వచ్చిన వారేనని, వీరు లాభాలు వచ్చిన తర్వాత అమ్మేసి బయటకు వెళ్లిపోయేవారేనన్నారు. నిధుల సమీకరణ నిర్ణయంతో స్టాక్‌ ధర పెరిగేందుకు అవకాశాలు పరిమితమేనన్నారు. బ్యాంకు ఈక్విటీ రెట్టింపు అవుతుందని, దాంతో స్టాక్‌ ధర కరెక్షన్‌కు వెళ్లొచ్చన్నారు. You may be interested

టారిఫ్‌ల పెంపు ఎవరికి ప్రయోజనం..?

Tuesday 3rd December 2019

టెలికం కంపెనీలు డేటా, వాయిస్‌ చార్జీలను భారీగా పెంచేశాయి. ఈ పెంపు ఏకంగా 40 శాతం వరకు ఉంది. దీంతో టెలికం షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఈ నెల 3 నుంచి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు చార్జీల పెంపు అమల్లోకి వస్తుంటే, 6వ తేదీ నుంచి జియో చార్జీల పెంపు అమలు కానుంది. టెలికం కంపెనీలు  ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి

ఆరంభ లాభాలు ఆవిరి

Monday 2nd December 2019

సూచీలు సోమవారం ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 8పాయింట్లు స్వల్ప లాభంతో 40,802 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 12050 దిగువన 12,048 వద్ద ముగిసింది. ఒక్క మెటల్‌ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా అటో రంగ షేర్లు  అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల క్షీణతతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 75 పాయింట్లు నష్టపోయి 32వేల

Most from this category