News


యస్‌ బ్యాంక్‌ విత్‌డ్రాయిల్‌ పరిమితి 18న ఎత్తివేత!

Saturday 14th March 2020
Markets_main1584170752.png-32480

పునరుద్ధరణ ప్రణాళికకు గ్రీన్‌సిగ్నల్‌
బ్యాంక్‌ సీఈవోగా ప్రశాంత్‌ కుమార్‌

ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళికలకు కేంద్ర కేబినెట్‌ గ్రీస్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా ఇప్పటికే పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్‌ కుమార్‌ సీఈవో, ఎండీగా ఎంపికయ్యారు. స్టేట్‌బ్యాంక్‌ మాజీ సీఎఫ్‌వో, డిప్యూటీ ఎండీగా పనిచేసిన ప్రశాంత్‌ను యస్‌ బ్యాంక్‌ పాలనాధికారిగా రిజర్వ్‌ బ్యాంక్‌ నియమించిన సంగతి తెలిసిందే. కాగా.. పీఎన్‌బీ మాజీ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సునీల్‌ మెహతాను యస్‌ బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ బాటలో మహేష్‌ కృష్ణమూర్తి, అతుల్‌ భేడాలను నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెర్టర్లుగా ఎంపిక చేశారు. యస్‌ బ్యాంక్‌పై ప్రస్తుతం అమలు చేస్తున్న నిషేధాన్ని(మారటోరియం) ఎత్తివేసిన వారం రోజుల్లోగా వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా యస్‌ బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటుకానుంది. యస్‌ బ్యాంక్‌ బోర్డులో ఎస్‌బీఐ మరో ఇద్దరు అధికారులను డైరెక్టర్లుగా నియమించనుంది. అవసరమైతే.. వీరికి జతగా రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం మరో డైరెక్టర్‌ను నియమించే వీలుంది. ప్రణాళిక ప్రకారం పునరుద్ధరించాక యస్‌ బ్యాంకుకు కొత్త బోర్డు ఏర్పాటయ్యేటంతవరకూ లేదా ఏడాదికాలంపాటు వీరంతా బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

ప్రణాళిక ఇలా..
యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళికను ప్రభుత్వం శుక్రవారం రాత్రి నోటిఫై చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ నెల 18 సాయంత్రానికల్లా యస్‌ బ్యాంక్‌పై విధించిన నిషేధం తొలగనున్నట్లు తెలుస్తోంది. రూ. 50,000కు మించి నగదు ఉపసంహరించకుండా యస్‌ బ్యాంక్‌ ఖాతాదారులపై ఈ నెల మొదట్లో నిషేధాన్ని విధించిన విషయం విదితమే. కాగా..  పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం యస్‌ బ్యాంక్‌ వాటాదారులు 75 శాతం వాటాను మూడేళ్లపాటు విక్రయించేందుకు వీలుండదు. ఇదేవిధంగా ఎస్‌బీఐ మినహా.. ఇతర ఇన్వెస్టర్లు 9 శాతానికి మించి వోటింగ్‌ రైట్స్‌ను వినియోగించుకునేందుకూ అవకాశముండదని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించిన నిబంధనల ప్రకారం వోటింగ్‌ రైట్స్‌పై నియంత్రణలు విధించనున్నట్లు తెలుస్తోంది.

ఎస్‌బీఐ ఇలా
యస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాను సొంతం చేసుకోనున్న ఎస్‌బీఐ మూడేళ్ల కాలంలో వాటాను 49 శాతానికి మించి పెంచుకునేందుకు వీలుండదు. ఇదే విధంగా 26 శాతంకంటే దిగువకు తగ్గించుకునేందుకూ అవకాశముండదు. యస్‌ బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ. 6200 కోట్లకు పెంచనున్నారు. దీంతో రూ. 2 ముఖ విలువగల షేర్ల సంఖ్య 3000 కోట్లకు చేరనుంది. ప్రిఫరెన్స్‌ కేపిటల్‌ రూ. 200 కోట్లుగా కొనసాగనుంది.You may be interested

బోర్డునుంచి తప్పుకున్న బిల్‌ గేట్స్‌!

Saturday 14th March 2020

మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ బోర్డునుంచి తప్పుకుంటున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ డైరెక్టర్ల బోర్డు, బర్క్‌షైర్‌ హాతవే బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్‌గేట్స్‌ తెలిపారు.64 ఏళ్ల బిల్‌గేట్స్‌ భార్యతో కలిసి ప్రారంభించిన బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఈ

నెలరోజుల్లో నిఫ్టీ టాప్‌టెన్‌ లూజర్లు ఇవే..!

Saturday 14th March 2020

కరోనా వైరస్‌ వ్యాధి భయాలతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐల పెట్టబడుల సంహరణ, దివాళా దిశగా సాగుతున్న యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారిటోరియం చర్యల లాంటి చర్యలతో నెల రోజుల నుంచి భారత్ స్టాక్‌ సూచీలు భారీ పతనాన్ని చవిచూసింది. ఈ నెలరోజుల్లో ఎన్‌ఎస్‌లోని  ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ-50  17.78శాతం నష్టాన్ని చవిచూసింది. ఈ నిఫ్టీ -50సూచీలోని మొత్తం 50

Most from this category