News


యస్‌బ్యాంక్‌ 30 శాతం జంప్‌

Thursday 3rd October 2019
Markets_main1570085724.png-28695

వారం రోజుల్లోనే 47శాతం నష్టపోయిన చవిచూసిన యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం భారీగా రికవరీ అయ్యాయి. బ్యాంక్‌ ఆర్థిక స్థితిగతులపై యాజమాన్యం స్టాక్‌ ఎక్చ్సేంజీలకు స్పష్టతనివ్వడంతో నేటి ఉదయం సెషన్‌లో షేర్లు 29శాతం వరకు లాభపడ్డాయి. ప్రమోటర్‌ రాణా కపూర్‌ తనఖా పెట్టిన 10 కోట్ల షేర్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించడం వల్లే షేర్లు భారీ పతనాన్ని చవిచూసినట్లు యస్‌బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటికి తమ బ్యాంకు ఫైనాన్షియల్‌ ఫండమెంటల్స్‌ బలంగానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. డిపాజిట్లు, నిధుల లభ్యతపై కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు ఉద్దేశ్యం పూర్తిగా తెరపైకి వచ్చాయని, కనీస మూలధన పరిమితికి మించి తమ వద్ద నిధుల లభ్యత ఉన్నట్లు బ్యాంక్‌ తెలిపింది. షేర్ల పతనానికి అడ్డుకట్ల వేసేందుకు తక్షణ చర్యలు ప్రారంభిస్తామని బ్యాంక్‌  ఎక్చ్సేంజీలకు వివరణ ఇచ్చింది. మరోవైపు బ్యాంక్‌ను కష్టాల కడలి నుంచి గట్టేక్కించే అంశంలో మేనేజ్‌మెంట్‌పై తమ పూర్తి నమ్మకం ఉందని సహ ప్రమోటర్‌ అశోక్‌ కపూర్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.35.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో ఇంట్రాడేలో షేర్లు 29 శాతం పెరిగి రూ.121.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం గం.12:00లకు షేర్లు క్రితం ముగింపు(రూ.32.00)తో పోలిస్తే 25శాతం లాభంతో రూ.39.95 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.35.20, రూ.41.40లుగా నమోదయ్యాయి. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఈక్విటీ, బంగారంపై బుల్లిష్‌: ఝున్‌ఝున్‌వాలా

Thursday 3rd October 2019

  ప్రస్తుతం ఇండియా ఈక్విటీ మార్కెట్లు చీకటి దశను ఎదుర్కొంటున్నాయని, కానీ మరి కొద్ది కాలంలో వెలుగొస్తుందని సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. ‘దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్నంతా అనిశ్చితిని ఇదివరకెప్పుడూ చూడలేదు. బహుశా ఇది మార్కెట్లకు ఉదయానికి ముందు వచ్చే చీకటి లాంటిది’ అని ఆయన అన్నారు. ‘మార్కెట్‌ పెరిగే ముందు, కోనుగోలు చేసుకోడానికి మనకొక అవకాశం ఇస్తుంది. ఇది వాతావరణం లాంటిది. మనకు నచ్చకపోయిన

లాభాల బాటలో టాటామోటర్స్‌ .!

Thursday 3rd October 2019

నష్టాల మార్కెట్‌ ట్రేడింగ్‌లోనూ టాటామోటర్స్‌ షేర్లు గురువారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఉదయం సెషన్‌లో 5.5శాతం పెరిగాయి. అమెరికాలో వార్షిక ప్రాతిపాదికన ఈ సెప్టెంబర్‌లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు పెరిగాయి. మరోవైపు దేశీయంగా ఇదే నెలలో ఏడాది ప్రాతిపాదికన అమ్మకాలు 50శాతం క్షీణించాయి. అయితే... నెల ప్రాతిపదికన ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్‌లో రిటైల్‌ వాహన విక్రయాలు 11శాతం పెరిగాయి. దసరా, దీపావళి పండుగ సీజన్‌ సందర్భంగా వాహన విక్రయాలు మరితం

Most from this category