News


రికవరి బాటలో యస్‌ బ్యాంకు షేర్లు

Monday 8th July 2019
Markets_main1562569921.png-26895

ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌ యస్‌ బ్యాంకు షేర్లు సోమవారం 5ఏళ్ల కనిష్టస్థాయి నుంచి రికవరీ అయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.87.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ పతనంలో భాగంగా ఆరంభంలోనే 3శాతం నష్టపోయి రూ.85.70ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఈ ధర షేరుకు 5ఏళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. స్థిరమైన పాలన వ్యవస్థతో పాటు ఇద్దరు మేనేజ్‌మెంట్‌ అధికారుల నియామకం గురించి బ్యాంకు అధికారులు స్పష్టతను ఇవ్వడం‍తో షేర్లు ఐదేళ్ల కనిష్టస్థాయి నుంచి రికవరి బాటపట్టాయి. బోర్డు, పాలనా వ్యవస్థ, అస్సెట్‌ పోర్ట్‌ఫోలియో, భవిష్యత్ వృద్ధి అవకాశాల గురించి గత వారాలుగా చాలా అవాస్తవ ఊహగానాలు వచ్చాయని, కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ఈ అవాస్తవాలు సృష్టించి ఇన్వెస్టర్ల, క్లయింట్ విశ్వాసాన్ని దెబ్బ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని యస్‌బ్యాంక్‌ అధికారులు ఆరోపించారు. పాలనా వ్యవస్థలో స్థిరత్వం కొరకు గవర్నెస్‌ అండ్‌ కంట్రోల్‌ అధికారిగా రాజీవ్‌ ఒబేరాయన్‌ను, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అధికారిగా అనురాగ్‌ అడ్లాకాను నియమించినట్లు యస్‌ బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకుకు ఎలాంటి ద్రవ్య కొరత లేదని ఆర్థికంగా స్థిరంగా ఉందని, తమ బ్యాంకు ఉండే అపారమైన పాలనా అనుభవం ద్వారా మెరుగైన పనితీరుతో తిరిగి పుంజుకుంటామని వారు వివరణ ఇచ్చారు. అలాగే బ్యాంకు మొదటి త్రైమాసిక ఫలితాలనుపై చర్చించేందుకు ఈ జూలై 17న బోర్డు డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు కంపెనీ షేర్లు 5ఏళ్ల కనిష్టం నుంచి 10శాతం ఎగసి రూ.94.35ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గత ముగింపు ధర(రూ.88.2)తో పోలిస్తే 5.73 శాతం లాభంతో రూ.93.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.85.70  రూ.404.00లుగా నమోదయ్యాయి.You may be interested

ఈక్వీటి మార్కెట్ల రేటింగ్‌ను తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Monday 8th July 2019

అంతర్జాతీయ ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచ ఈక్వీటి మార్కెట్ల రేటింగ్‌ను ‘ఈక్వల్‌ వెయిట్‌’ నుంచి ‘అండర్‌ వెయిట్‌’కు  మోర్గాన్‌ స్టాన్లీ తన తాజా నివేదికలో తగ్గించింది. అం‍తేకాకుండా ప్రస్తుత స్థాయిల నుంచి పైకి పెరగడానికి ఈ మార్కెట్లకు పరిమితులున్నాయని పేర్కొంది. ఎస్‌ అండ్‌ పీ 500, ఎంసీఐ యూరోప్‌, ఎంఎస్‌సీఐ ఈఎం, టోపిక్స్‌ జపాన్‌ మార్కెట్లు వచ్చే 12 నెలలో మోర్గాన్‌ స్టాన్లీ ధర లక్ష్యాని కన్నా సరాసరి 1

11425 పాయింట్ల వరకు పతనం!

Monday 8th July 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా బడ్జెట్‌ రోజు నిఫ్టీ చార్టుల్లో ట్రెండ్‌రివర్సల్‌ జరిగిందని టెక్నికల్‌ నిపుణులు విశ్లేషించారు. నిఫ్టీ తన గత గరిష్ఠం 12100 పాయిం‍ట్లను దాటలేక వెనక్కు మరలింది. ఈ తరహా వెనకంజ మార్కెట్‌కు నెగిటివ్‌ పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్‌ వర్గాల అసంతృప్తికి ఇది నిదర్శనమని, రాబోయేరోజుల్లో మార్కెట్లో మరింత డామేజి జరుగుతుందని తెలిపారు. నిఫ్టీ క్రమంగా 11590 పాయింట్ల వరకు ఆపైన 11425 పాయింట్ల వరకు పతనమైతుందని అంచనా

Most from this category