STOCKS

News


యస్‌ బ్యాంక్‌ 7 శాతం అప్‌

Wednesday 7th August 2019
Markets_main1565157689.png-27601

  • 7.50శాతం ర్యాలీచేసిన షేర్లు

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంకు షేర్లు బుధవారం 7శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.86.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారంలో ప్రారంభం కానున్న యస్‌ బ్యాంక్‌ క్యూఐపీ ఇష్యూలో ప్రైవేట్‌రంగ ఈక్విటీ సంస్థలైన జీఐటీ, వెస్ట్‌బ్రిడ్జ్‌ సంస్థలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సంస్థలు పాల్గొనవచ్చనే వార్తలు వెలుగులోకి రావడంతో ఈ యస్‌ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ఇంట్రాడే షేర్లు 7.70శాతం వరకు లాభపడి రూ.92.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. షేరు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ర్యాలీ కావడం విశేషం. ఉదయం గం.11:15ని.లకు షేరు గత ముగింపు(రూ.85.4)తో పోలిస్తే 6.50శాతం లాభంతో రూ.90.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్యూఐపీ ఇష్యూ ద్వారా హైనెట్‌ వర్త్‌ సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా 500 బిలియన్‌ డాలర్లను సమీకరించేందుకు బ్యాంకు సిద్దమైంది. ఈ ఇష్యూకు మోతీలాల్‌ ఓస్వాల్‌, జేఎం ఫైనాన్స్‌ సంస్థలు మర్చెంట్‌ బ్యాంకర్లు వ్యవహరించున్నారు. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 79.50, రూ.404.00లుగా నమోదయ్యాయి.You may be interested

నిరుత్సాహకర ఫలితాలు: ఇండియన్‌బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 9శాతం క్రాష్‌

Wednesday 7th August 2019

ఫైనాన్స్‌, హౌసింగ్‌ రంగంలో సేవలు అందిస్తున్న ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ షేర్లు బుధవారం  9శాతం పతనయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడటం షేరు పతనానికి కారణమైంది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ మొదటి క్వార్టర్‌ ఫలితాలు విడుదల చేసింది. ఈ క్యూ1లో కంపెనీ రూ.802 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో కంపెనీ సాధించిన రూ.1,055 కోట్లతో పోలిస్తే ఇది 24

టైటాన్‌ 3 శాతం డౌన్‌

Wednesday 7th August 2019

క్యూ1 ఫలితాలను టైటాన్‌ కంపెనీ మంగళవారం ప్రకటించిన తర్వాత పలు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు, ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను తగ్గించాయి. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో టైటాన్‌ కంపెనీ లి. షేరు విలువ ఉదయం 11.04 సమయానికి 3.55 శాతం నష్టపోయి రూ. 1,009.50 వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్లో ఈ కంపెనీ షేరు 0.5 శాతం లాభపడి రూ. 1,042.00 వద్ద ముగిసింది.  టైటాన్‌ క్యూ 1 ఫలితాలు:

Most from this category