News


యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులకు పీఈ సంస్థల ఆసక్తి- షేరు జూమ్‌

Thursday 13th February 2020
Markets_main1581566643.png-31739

4.5 శాతం జంప్‌చేసిన షేరు
14న క్యూ3 ఫలితాల విడుదల
పెట్టుబడులకు 3 పీఈ సంస్థల ఆసక్తి

నిధుల సమీకరణ సన్నాహాలలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలను ఈ నెల 14(శుక్రవారం)కల్లా విడుదల చేయనున్నట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలతోపాటు.. తొమ్మిది నెలల(ఏప్రిల్‌-డిసెంబర్‌) పనితీరును సైతం వెల్లడించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు హైజంప్‌ చేసింది. రూ. 37.30కు చేరింది. ఉదయం​ 9.20 ప్రాంతం‍లో 4.5 శాతం ఎగసి రూ. 36.75 వద్ద ట్రేడవుతోంది. 45 రోజుల్లోగా ఫలితాలు ప్రకటిం‍చవలసి ఉన్న నిబంధనల కారణంగా ఎక్స్ఛేంజీలకు ఫలితాల విడుదలపై వివరణ ఇచ్చినట్లు యస్‌ బ్యాంక్‌ తెలియజేసింది.

కంపెనీల ఆసక్తి 
పలు ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి పెట్టుబడులపట్ల ఆసక్తి వ్యక్తమైనట్లు యస్‌ బ్యాం‍క్‌ తాజాగా వెల్లడించింది. బ్యాంకులో పెట్టుబడుల ద్వారా వాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల జాబితాలో జేసీ ఫ్లవర్స్‌ అండ్‌ కో, టిల్డెన్‌ పార్క్‌ కేపిటల్‌ మేనేజ్‌మెంట్‌, ఓక్‌ హిల్‌ అడ్వయిజర్స్‌(ఓహెచ్‌ఏ యూకే), సిల్వర్‌ పాయింట్‌ కేపిటల్‌ ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీలతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్లు తెలియజేసింది. 

వాటాదారులు ఓకే
ఇటీవల యస్‌ బ్యాంకు నిర్వహించిన ఈజీఎంలో వాటాదారులు అధీకృత మూలధన పెంపునకు అనుమతించిన విషయం విదితమే. ఆథరైజ్‌డ్‌ షేర్‌ కేపిటల్‌ను ప్రస్తుత రూ. 800 కోట్ల నుంచి రూ. 1100 కోట్లకు పెంచేందుకు యస్‌ బ్యాంక్‌ చేసిన ప్రతిపాదనకు వాటాదారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాకుండా ఈక్విటీ షేర్లు, మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లవరకూ సమీకరిం‍చేందుకు సైతం​అనుమతించారు. 



You may be interested

లాభంతో మొదలై క్షణాల్లో నష్టాల్లోకి...!

Thursday 13th February 2020

దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గురువారం లాభంతో మొదలై, క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి. ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సూచీలను నష్టాల్లోకి మళ్లించాయి. సెన్సెక్స్‌ 141 పాయింట్ల లాభంతో 41,707.21 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 12,219.55 వద్ద ట్రేడింగ్‌ను మొదలయ్యాయి. అయితే బుధవారం మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువడిన డిసెంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) మైనస్‌లోకి వెళ్లిపోగా, జనవరి వినియోగ

ఎకానమీకి వైరస్‌!!

Thursday 13th February 2020

ప్రపంచ వృద్ధి రేటు అంచనాలు కట్‌ 2.2 శాతానికి కుదించిన ఈఐయూ కరోనా భయాలే కారణం న్యూఢిల్లీ: చైనాలో బైటపడిన కరోనా వైరస్‌ ధాటికి ఈ ఏడాది ప్రపంచ ఎకానమీ వృద్ధి కుంటుపడనుంది. 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో వెల్లడించింది. "ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌ ముప్పుగా పరిణమించింది. ఇది మరింతగా ప్రబలకుండా నివారించేందుకు చైనా

Most from this category