News


మళ్లీ రూ. 40 స్థాయికి యస్‌బ్యాంక్‌??

Monday 4th November 2019
Markets_main1572856621.png-29333

బ్రోకరేజ్‌ల అంచనాలు
తాజాగా యస్‌బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ప్రకటించిన మూలధన సమీకరణతో బ్యాంకు షేరు మరోమారు రూ. 40 స్థాయిలకు దిగివస్తుందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు తాజా ఫలితాల్లో ఏమాత్రం మెరుగుదల చూపలేదు. దీంతో బ్యాంకుపై ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న పాజిటివ్‌ ధృక్పధం కరుగుతున్న సూచనలు కనిపించాయి. తాజాగా ప్రకటించిన మూలధన సమీకరణలో భాగంగా బ్యాంకు ఈక్విటీలో దాదాపు 30 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందని, ఇందుకు ఆర్‌బీఐ అనుమతి కావాలని నిపుణులు భావిస్తున్నారు. గతంలో కాథలిక్‌ సిరియన్‌ బ్యాంకు విషయంలో బ్యాంకు ఇలా భారీ వాటా విక్రయానికి అనుమతినిచ్చింది. ఈ దఫా యస్‌బ్యాంకు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలని, ఏదిఏమైనా బ్యాంకు తిరిగి వృద్ధి బాట పట్టాలంటే చాలా సమయం పడుతుందని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. ఎన్‌పీఏలు పెరుగుతూనే ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరాన్ని బ్యాంకు నష్టాలతోనే ముగిస్తుందని భావిస్తున్నారు. దీంతో పలు బ్రోకరేజ్‌లు యస్‌బ్యాంకు షేరుకు ‘‘అమ్మొచ్చు’’ రేటింగ్‌ ఇస్తున్నాయి. 
బ్యాంకుపై బ్రోకింగ్‌ సంస్థల తాజా అభిప్రాయాలు..
1. నోమురా: బ్యాంకు ఒక్క షేరును రూ. 60 చొప్పున కొత్త వాటాదారులకు విక్రయిస్తే 120 కోట్ల డాలర్లు సమకూరతాయి. ఇదే జరిగితే బ్యాంకు ఈక్విటీలో 50 శాతం డైల్యూషన్‌ సంభవిస్తుంది. అప్పుడు సీఈటీ-1 నిష్పత్తి 10.5 శాతానికి పెరుగుతుంది. ఈ రెండిటితో పాటు రూ. 1500 కోట్ల పీపీఓపీ కలిస్తే బ్యాంకుకు పొంచి ఉన్న తక్షణ ముప్పును నివారిస్తాయి. అయితే ఈక్విటీ పలచన కావడం వల్ల షేరు ధర కుంగవచ్చు.
2. మోర్గాన్‌స్టాన్లీ: బ్యాంకు షేరు టార్గెట్‌ ధర రూ. 55 నుంచి రూ. 40కు తగ్గించింది. ఒత్తిడిలో ఉన్న నికర రుణాలు సీఈటీ1లో 150 శాతానికి చేరడం అత్యంత ఆందోళనకరం. దీనివల్ల పీపీఓపీ మరింత ఒత్తిడికి గురవుతుంది.
3. సిటీగ్రూప్‌: టార్గెట్‌ను రూ. 80 నుంచి రూ. 50కి తగ్గించింది. 
4. సీఎల్‌ఎస్‌ఏ: టార్గెట్‌ను రూ. 110 నుంచి రూ. 75కు తగ్గించింది. ఎర్నింగ్స్‌ తలనొప్పులు కొనసాగుతాయి. మూలధనం వచ్చాక బాలెన్స్‌షీటు కన్సాలిడేట్‌ కావచ్చు. 
5. గోల్డ్‌మన్‌ సాక్స్‌: టార్గెట్‌ను రూ. 62గా నిర్ణయించింది. 
6. మాక్క్వైరీ: టార్గెట్‌ను రూ. 50గా పేర్కొంది. 
7. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: టార్గెట్‌ రూ. 55. వాటా విక్రయంతో బుక్‌వాల్యూ డైల్యూషన్‌ ఎక్కువగా ఉండొచ్చు. అందువల్ల బ్యాంకు భవిష్యత్‌ వృద్ధి, మరింత మూలధన సమీకరణ, ఆర్‌ఓఈ మెరుగుదల తదితరాలపై అనిశ్చితి కొనసాగవచ్చు. 
8. ఫిలిప్‌ క్యాపిటల్‌: టార్గెట్‌ను రూ. 85 నుంచి రూ. 50కి తగ్గించింది. మూలధన సమీకరణ అంశం పాజిటివ్‌ విషయమే కానీ, ఆస్తుల నాణ్యత మరింత క్షీణించడం ఆందోళనకరం. రాబోయే మరికొన్ని త్రైమాసికాలు బ్యాంకు అధిక స్లిపేజ్‌లను ప్రకటించవచ్చు. 

 


బ్రోకరేజ్‌ల డౌన్‌గ్రేడింగ్‌తో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో యస్‌బ్యాంకు దాదాపు 10 శాతం పతనమైంది. అయితే బ్యాంకు సీఈఓ వివరణలతో తిరిగి 7  శాతం లాభాల్లోకి మరలింది. మధ్యాహ్న సమయానికి ఫ్లాట్‌గా రూ. 66.40 వద్ద ట్రేడవుతోంది. You may be interested

వెలుగులో స్టీల్‌ షేర్లు

Monday 4th November 2019

అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్ల ర్యాలీ కారణంగా దేశీయ మార్కెట్లో  స్టీల్‌ షేర్లు మెరుస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరుదేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఈ సానుకూలాంశంతో రానున్న రోజుల్లో మందగించిన ప్రపంచ వృద్ధి తిరిగి కోలుకుంటుందనే అంచనాలు ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెంచాయి. స్థూల ఆర్థిక వ్యవస్థలో అనుకూలమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫెర్రస్‌

అమ్మకాల ఒత్తిడిలో ఆటో షేర్లు

Monday 4th November 2019

మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోయింది. మెటల్‌ ఐటీ షేర్ల ర్యాలీతో ఉదయం సెషన్‌లో సెన్సెక్స్‌ సెనెక్స్‌ 318 పాయింట్లును, నిఫ్టీ 99 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే. మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్న ఆటో రంగ షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికి సూచీల లాభాల్ని హరించివేశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఆటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.50శాతం శాతం నష్టపోయింది. గతవారం మార్కెట్‌

Most from this category