News


యస్‌బ్యాంక్‌ 13శాతం క్రాష్‌..!

Monday 30th September 2019
Markets_main1569819205.png-28620

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ యస్‌బ్యాంక్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 13శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్లు రూ.48.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంలో భాగంగా ఈ బ్యాంకు షేర్లు కూడా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 13శాతం నష్టపోయి రూ.42.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.10:10లకు షేర్లు క్రితం ముగింపు(రూ.48.75)తో పోలిస్తే 9.50శాతం నష్టంతో రూ.44.10 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేర్ల ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.42.40లు, రూ.286.00లుగా నమోదయ్యాయి. గతవారంలో కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ సంస్థలో ఒకటైన యస్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ(వైసీపీఎల్‌) ప్రతి షేరు ధర రూ.51.94 చొప్పున మొత్తం 4.65 కోట్ల ఈక్విటీ షేర్లను(1.82శాతం వాటాకు సమానం) రూ.241.5 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. 



You may be interested

1500డాలర్ల దిగువకు పసిడి

Monday 30th September 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1500డాలర్ల దిగువకు చేరుకుంది. ఆసియాలో సోమవారం ఔన్స్‌ పసిడి ధర 8డాలర్లు (అరశాతం) క్షీణించి 1,498.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీజింగ్, వాషింగ్టన్‌ లు తమ మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాన్ని "ప్రశాంతమైన మరియు హేతుబద్ధమైన వైఖరితో" పరిష్కరించుకుంటాయని చైనా ఉప వాణిజ్యమంత్రి వాంగ్ షౌవెన్ ఆదివారం తెలిపారు.ఇరుదేశాలకు చెందిన  ఉన్నతస్థాయి అధికారుల

పతనం తర్వాత కోలుకుంటున్న చమురు

Monday 30th September 2019

గత సెషన్‌లో రెండువారాల కనిష్ఠానికి పడిపోయిన చమురు ధరలు తిరిగి సోమవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అయినప్పటికి అంతర్జాతీయ పరిణామాల వలన చమురు లాభాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం 9.51 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.18 శాతం లాభపడి బారెల్‌ 61.15 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.14 శాతం లాభపడి 55.99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా బ్రెంట్‌ క్రూడ్‌ శుక్రవారం సెషన్లో 1.3 శాతం

Most from this category