News


యస్‌ బ్యాంక్‌ షేరు పతనం

Monday 13th January 2020
Markets_main1578889186.png-30881

5 శాతం దిగజారిన యస్‌ బ్యాంక్‌ షేరు
నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌

వారాంతాన సమావేశమైన బ్యాంకు బోర్డు నిధుల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. వివిధ సెక్యూరిటీల జారీ ద్వారా రూ 10,000 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. అయితే ఎర్విన్‌ సింగ్‌, ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ సంయుక్తంగా ప్రకటించిన 1.2 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ను బోర్డు తిరస్కరించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం(ఉదయం 9.40 ప్రాంతంలో) యస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 43 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 41 వరకూ జారింది. కాగా.. బ్యాంకు కార్పొరేట్‌ పాలనపై అసంతృప్తితో స్వతంత్ర డైరెక్టర్‌ ఉత్తమ్‌ అగర్వాల్‌ రాజీనామా చేసినట్లు వెలువడిన వార్తలతో శుక్రవారం సైతం యస్‌ బ్యాంక్‌ షేరు 5 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. 



You may be interested

కొంత రిస్క్‌ తీసుకునే వారికి..

Monday 13th January 2020

కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ గతేడాది లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేస్తే, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ నష్టపోయాయి. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి లాభాలు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో వారికి నష్టాలు మిగిలాయి. కానీ, ఇదే పనితీరు ఎల్లప్పుడూ కొనసాగదు. ఒక్కోసారి ఒక్కో విభాగం ర్యాలీ చేస్తే, మరో విభాగం నష్టపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అన్ని రకాల స్టాక్స్‌తో కూడిన విస్తృత ర్యాలీ కూడా ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు ఈ తరహా ఒక్కో

పన్ను ఆదా రాచమార్గాలు

Monday 13th January 2020

అధిక రాబడులు ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే ఆ తర్వాత ఎన్‌పీఎస్‌ టాప్‌ ఎన్‌పీఎస్‌తో పన్ను ఆదా, రిటైర్మెంట్‌ కోసం నిధి పన్ను ఆదా కోసం బీమా వైపు చూడొద్దు టర్మ్‌ ప్లాన్ల ప్రీమియంపైనా పన్ను ఆదా చివరి నిమిషంలో ఇన్వెస్ట్‌ చేయాలంటే బ్యాంకు ఎఫ్‌డీ పన్ను ఆదాయం ఉన్న వారు కొంత మొత్తంపై పన్ను పడకుండా చూసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో పెట్టుబడి

Most from this category