News


సీజీ పవర్‌ దెబ్బతో యస్‌ బ్యాంక్‌, ఎంఎఫ్‌లు విలవిల!

Wednesday 21st August 2019
Markets_main1566368588.png-27918

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యుషన్స్‌, ఖాతాలను తారుమారు చేయడంతో పాటు వేలకోట్ల రూపాయిల మనిలాండరింగ్‌కు పాల్పడిన విషయాలు బయటపడడంతో ఈ సంస్థకు రుణాలిచ్చిన యస్‌ బ్యాంక్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది మే నెల నుంచి సీజీ పవర్‌ సంస్థలో యస్‌ బ్యాంక్‌ 12.8 శాతం వాటాను ఆధినంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. యస్‌ బ్యాంక్‌ షేరు విలువ మంగళవారం సెషన్‌లో 7.1 శాతం పతనమయ్యి బీఎస్‌ఈలో 71.25 వద్ద చేరుకుంది. ఈ బ్యాంక్‌ షేరు గత సెషన్‌లో ఏళ్ల కనిష్ఠాన్ని తాకింది. అనీల్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌, జీ గ్రూప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, కాఫీ​డే ఎంటర్‌ప్రైజెస్‌ వంటి సంస్థలకు రుణాలివ్వడంతో గత ఏడాది కాలంలో యస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ 80 శాతం మేర తుడిచిపెట్టుకుపోయింది.

  యస్‌ బ్యాంక్‌తోపాటు, కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌)కు కూడా సీజీ పవర్‌లో వాటాలున్నాయి. ఈ సంస్థలో జూన్‌ చివరినాటికి 9.18 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మానెజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) కలిగి ఉండగా, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ 8.94 శాతం, ప్రాంక్లిన్‌ టెంప్లటెన్‌ ఏఎంసీ 3.19 శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ ట్రస్టీ 2.03 శాతం, ఐడీఎఫ్‌సీ స్టెర్లింగ్‌ ఫండ్‌ 1.53 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. వీటితో పాటు ఎల్‌ఐసీ 2.25 శాతం వాటాను, కేకేఆర్‌ 10.8 వాటాను కలిగి ఉన్నాయి. 
  యస్‌ బ్యాంక్‌ షేరు బుధవారం ఉదయం 11.33 సమయానికి 3.44 శాతం నష్టపోయి రూ. 68.75 వద్ద ట్రేడవుతుండగా, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యుషన్స్‌ 20 శాతం నష్టపోయి రూ. 11.85 వద్ద వరుసగా రెండవ రోజు డౌన్‌ సర్య్కూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యింది.



You may be interested

నిఫ్టీ వృద్ధి అంచనాలు తగ్గించిన గ్లోబల్‌ బ్రోకరేజ్‌లు

Wednesday 21st August 2019

ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అనేకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిఫ్టీ ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించాయి. దీంతో పాటు ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం ఈ సంస్థలు కట్‌చేశాయి. క్యు1లో అంచనాలకన్నా తక్కువగా ఎర్నింగ్స్‌ ఉండడంతో బ్రోకరేజ్‌లు ఈ నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిఫీ​వృద్ధి అంచనాలు 31 నుంచి 25 శాతానికి పతనం కావచ్చని, వచ్చే ఏడాదికి ఈ అంచనా 22 శాతం ఉండొచ్చని క్రెడిట్‌ సూసీ తన

ఫెడ్‌ మినిట్స్‌ కోసం పసిడి ఎదురుచూపులు

Wednesday 21st August 2019

ఇన్వెస్టర్లు, ట్రేడర్లు యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌పై దృష్టిసారించిన నేపథ్యంలో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధరలు 3డాలర్ల నష్టంతో 1,512.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. జూలై 30, 31 తేదీల్లో జరిగిన ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ అమెరికాలో నేటి రాత్రి విడుదల కానున్నాయి. దాదాపు 10ఏళ్ల తరువాత ఫెడ్‌ వడ్డీరేట్లపై కోత విధించిన

Most from this category