News


యస్‌ బ్యాంక్‌ నిధులు సమీకరణ ఫలించేనా?

Friday 29th November 2019
Markets_main1575008054.png-29949

దేశీయ అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌లలో ఒకటైనా యస్‌ బ్యాంక్‌ తన నిధుల సమీకరణకు సంబంధించిన వివరాలను శుక్రవారం జరగనున్న బోర్డు మీటింగ్‌ తర్వాత మీడియాకు విడుదల చేసే అవకాశం ఉంది. తీవ్ర రుణ భారం, ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్స్‌) సంక్షోభం వంటి అనేక సమస్యలు చుట్టుముట్టడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ ఈ ఏడాదిలో భారీగా పడిపోయింది. కాగా 1.2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరించడంపై  మేనేజ్‌మెంట్‌ దృష్ఠి సారించందని బ్యాంక్‌ గత కొన్ని నెలల నుంచి చెబుతోంది. ఈ నిధుల సమీకరణకు సంబంధించిన ప్రణాళికను బ్యాంక్‌ బోర్డు శుక్రవారం జరగనున్న బోర్డు సమావేశంలో అమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ పేరును, ఎంత వరకు నిధులను పెట్టుబడిగా పెడుతున్నారో వంటి అంశాలను విడుదల చేయనుం‍ది. కానీ ఈ ప్రణాళికకు  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం తప్పనిసరి.
ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి..
     బ్యాంక్‌ 1.2 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించేందుకు ప్రయత్నిస్తోందని, ఉత్తర అమెరికాకు చెందిన ఒక కుటుంబంలో బిడ్లు దాఖలు చేసిన ఇన్వెస్టర్లలో ఉన్నారని బ్యాంక్‌ పేర్కొంది. ఈ నిధుల సమీకరణతో బ్యాంక్‌ను ఇంకో రెండేళ్లు నడిపించొచ్చని బ్యాంక్‌ సీఈఓ రవనీత్‌ గిల్‌ అన్నారు. దేశీయ బ్యాంకుల్లో 5 శాతం వాటా కంటే ఎక్కువ కొనుగోలు చేయాలంటే దానికి ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి. దేశీయ బ్యాంకులో ఫైనాన్సియల్‌ కంపెనీ గరిష్ఠంగా 15 శాతం వాటాను, ఫైనాన్సేతర కంపెనీ 10 శాతం వాటాను మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంటుంది. అధిక మొత్తంలో వాటాను కొనుగోలు చేయడంపై ఆర్‌బీఐ నిరాసక్తిగా ఉన్నప్పటికి, ఒకే ఇన్వెస్టర్‌ 40 శాతం లేదా అంత కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయడంపై ఒక ప్రొవిజన్ అందుబాటులో ఉంది. అది కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే. కాగా ఈ మినహాయింపు మూడేళ్ల కిందట కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్సియల్‌ హోల్డింగ్‌, దేశీయ బ్యాంక్‌ అయిన సీఎస్‌బీ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత నుంచి అమలులోకి వచ్చింది. ఈ బ్యాంక్‌ను అప్పుడు క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌గా పిలిచేవారు. దీంతో మొట్టమొదటిసారిగా దేశీయ బ్యాంక్‌లో అధిక వాటాను కొనుగోలు చేయడానికి విదేశీ సంస్థకు అవకాశం ఇచ్చినట్టయ్యింది. 
యస్‌ బ్యాంక్‌ రెండింతలయ్యింది..
   దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ మంచి ప్రదర్శన చేయడంతో, అక్టోబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు గల సమయంలో యస్‌ బ్యాంక్‌ షేరు విలువ రెండింతలయ్యింది. ఇప్పుడు యస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ 2.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ ర్యాలీతో  ఈ ఏడాదిలో 61 శాతం మేర పతనమయ్యిన యస్‌ బ్యాంక్‌ నష్టం పరిమితమయ్యింది. వివిధ ఎన్‌బీఎఫ్‌సీలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, ఒత్తిడిలోని సంస్థలపై బ్యాంక్‌ ఎక్స్‌పోజర్‌ పెరగడంతో, యస్‌ బ్యాంక్‌ మొండి బకాయిలు గణనీయంగా పెరిగాయి. దీంతో బ్యాంక్‌ తప్పనిసరిగా ప్రోవిజన్లను కేటాయించవలసి రావడంతోపాటు, బ్యాంక్‌ క్యాపిటల్‌ కూడా భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌ ప్రధాన ఈక్విటీ క్యాపిటల్‌(8.70 శాతం), నియంత్రణ సంస్థ నిర్ణయించిన కనీస క్యాపిటల్‌ 8 శాతం కంటే స్వల్పంగా పైనుంది. గతంలో బ్యాంక్‌ మొండి బకాయిలను ప్రకటించడంలో అవతవకలకు పాల్పడ్డారని యస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను పదవి నుంచి దిగిపోమని  ఆర్‌బీఐ ఒత్తిడి చేసింది. ఆ తర్వాత రవనీత్‌ గిల్‌ యస్‌ బ్యాంక్‌ సారధిగా తొమ్మిది నెలల కిందట పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి బ్యాంక్‌ను క్లీన్‌ చేసేందుకు గిల్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ అధ్వాన్న కంపెనీలకు రూ. 314 బిలియన్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివున్న ఈ బ్యాంక్‌కు, భవిష్యత్‌లో డీఫాల్ట్‌లను ఎదుర్కొనేందుకు మరింతగా నిధుల అవసరం ఉంది.You may be interested

డిసెంబర్‌ సీరిస్‌లో టాప్‌ 10 రోలోవర్లు..

Friday 29th November 2019

నిఫ్టీ బ్యాంకులో డిసెంబర్‌ సీరిస్‌ రోలోవర్లు ఎక్కువగా కనిపించాయి. దీంతో నిఫ్టీ కన్నా బ్యాంకునిఫ్టీ డిసెంబర్‌లో మెరుగైన ప్రదర్శన చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. నవంబర్‌లో ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు లాంటి దిగ్గజాల ర్యాలీ నిఫ్టీ, బ్యాంకునిఫ్టీలను ఆల్‌టైమ్‌హైకి చేర్చింది. నవంబర్‌ సీరిస్‌లో నిఫ్టీకన్నా బ్యాంకు నిఫ్టీ ఎక్కువ లాభం అందించింది. దేశీయ వీఐఎక్స్‌ 15 స్థాయి దిగువకు వచ్చింది. ఫ్యూచర్స్‌లో భారీ షార్ట్‌కవరింగ్‌ను ఎఫ్‌ఐఐలు చేశాయి. డిసెంబర్‌ సీరిస్‌కి నిఫ్టీలో

ఆరేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి?!

Friday 29th November 2019

రాయిటర్స్‌ పోల్‌ అంచనా దేశీయ ఎకానమీ గత ఆరేళ్లలో అత్యంత కనిష్ఠ వృద్ధిని సెప్టెంబర్‌ త్రైమాసికంలో నమోదు చేయవచ్చని రాయిటర్స్‌పోల్‌లో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. క్యు2లో జీడీపీ 4.7 శాతానికి పరిమితం కావచ్చని పోల్‌లో సరాసరిన అంచనా వేశారు. ఇది గత త్రైమాసికం వృద్ధి 5 శాతం కన్నా తక్కువ. ప్రైవేట్‌ పెట్టుబడులు బలహీనపడడం, కన్జూమర్‌ డిమాండ్‌ మందగమనం, అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు.. ఎకానమీపై ప్రభావం చూపాయని నిపుణులు భావిస్తున్నారు. తాజా అంచనాలు

Most from this category