News


కొనసాగుతున్న యస్‌బ్యాంక్‌ షేరు పతనం

Wednesday 12th February 2020
Markets_main1581490850.png-31724

యస్‌ బ్యాంక్‌ షేరు వరుసగా మూడో రోజూ నష్టాన్ని చవిచూసింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.36.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో మొండిబకాయిలు మరింత పెరగవచ్చనే భయాలతో డిపాజిట్‌దారులు యస్‌ బ్యాంకు నుంచి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు గణాంకాలు వెలువడ్డాయి. దీంతో  షేరు ఈ వారం ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఈ మూడు ట్రేడింగ్‌ సెషన్‌లో షేరు ఏకంగా 9శాతం నష్టాన్ని చవిచూసింది. మధ్యాహ్నం 12గంటలకు షేరు మునపటి ముగింపు(రూ.36.85తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.35.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.00, రూ.286.00గా నమోదయ్యాయి. 



You may be interested

గ్రామీణ దన్ను: ఈ 10 స్టాక్స్‌కు జోష్‌?

Wednesday 12th February 2020

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల ప్రభావం జాబితాలో అగ్రికెమికల్స్‌, ట్రాక్టర్స్‌ కంపెనీలు ఫుట్‌వేర్‌, ఎఫ్‌ఎంసీజీ, మైక్రో ఫైనాన్స్‌కూ చోటు పలు సానుకూల చర్యలతో బడ్జెట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు వీలు కల్పించే ప్రయత్నం చేపట్టినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు అధిక కేటాయింపులు, కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) రద్దు వంటి అంశాలున్నట్లు ప్రస్తావిస్తున్నారు. తగ్గుతున్న వ్యవసాయ ఆదాయం, గ్రామీణ డిమాండ్‌ మందగించడం వంటి ప్రతికూల పరిస్థితులను

కరోనాతో ఈ కంపెనీలకు లాభం!

Wednesday 12th February 2020

చైనాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో పలు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, ఆ దేశం నుంచి పలు ఎగుమతులు నిలిచిపోతున్నాయి. దీంతో అలాంటి ఉత్పత్తులు చేసే దేశీయ కంపెనీలకు సమీప భవిష్యత్‌లో డిమాండ్‌ ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌, కెమికల్స్‌, ఎరువులు, ప్లాస్టిక్‌ రంగాల కంపెనీలకు చైనా ఇబ్బందులు లాభదాయకంగా మారతాయని ట్రేడింగ్‌బెల్స్‌ అనలిస్టు సంతోశ్‌ మీనా చెప్పారు. ఈ రంగాలకు చెందిన ఐదు కంపెనీలను

Most from this category