News


ఎస్‌బీఐ అండ- యస్‌ బ్యాంక్‌ కేక

Friday 24th January 2020
Markets_main1579849639.png-31166

రెండు రోజుల్లో 14 శాతం ప్లస్‌
పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యలతో గురువారం ఒక్కసారిగా జోరందుకున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. మధ్యాహ్నం 12.15 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 44 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 10 శాతం దూసుకెళ్లి రూ. 45ను తాకింది. వెరసి నెల రోజుల తదుపరి అత్యధికంగా లాభపడింది. ఇంతక్రితం 2019 డిసెంబర్‌ 12న ఇంట్రాడేలో 12 శాతం ఎగసింది. దీంతో గత రెండు రోజుల్లోనే యస్‌ బ్యాంక్‌ షేరు 14 శాతం ర్యాలీ చేయగలిగింది. గురువారం సైతం ఈ షేరు 6 శాతం పెరిగి రూ. 41 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.  మధ్యాహ్నానికల్లా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి 17.3 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం!

ఏం జరిగిందంటే?
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ విలేకరులతో యస్‌ బ్యాంక్‌కు మద్దతుగా మాట్లాడారు. సుమారు 40 బిలియన్‌ డాలర్ల బ్యాలన్స్‌షీట్‌ కలిగిన యస్‌ బ్యాంక్‌.. దేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్లో చెప్పుకోదగ్గ సంస్థ అంటూ కితాబునిచ్చారు. దీంతో యస్‌ బ్యాంక్‌ విఫలంకాకపోవచ్చని వ్యాఖ్యానించారు. బ్యాంకును నిలబెట్టేందుకు కొన్ని పరిష్కారాలు లభించవచ్చునంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల నిధుల సమీకరణలో యస్‌ బ్యాంక్‌ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం అప్‌!

Friday 24th January 2020

ఉదయం నష్టాల్లో ప్రారంభమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మధ్యాహ్నం కల్లా మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా 1 శాతం జంప్‌చేసింది. నేటి ఉదయం 46 పాయింట్ల నష్టంతో 31వేల దిగువున 30,974 వద్ద ప్రారంభమైన సంగతి తెలిసిందే. మధ్యాహ్న సెషన్‌లో ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో12:15 గంటలకు మునుపటి ముగింపు (31,004.05)తో పోలిస్తే 1శాతం(296 పాయింట్లు) లాభంతో 31,299.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా

ఇండియా బుల్స్‌ , సెంచురీ టెక్స్‌టైల్స్‌ అప్‌

Friday 24th January 2020

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 22,93,306 షేర్లను విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ అయిన క్రెడిట్‌ సూసీ బ్లాక్‌ డీల్‌ ద్వారా సొంతం చేసుకోవడంతో 12 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో షేర్‌ ధర 4.23 శాతం పెరిగి 325.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  సెంచురీ టెక్స్‌టైల్స్‌ ప్రైవేటు ప్రాతిపదికన ఎన్‌సీడీలు జారీ చేయడం ద్వారా రూ.400 కోట్లను సమీకరించాలని కంపెనీ బోర్డు నిర్ణయించడంతో  12 గంటల  సమయంలో ఎన్‌ఎస్‌ఈలో సెంచురీ టెక్స్‌టైల్స్‌ షేర్‌ ధర

Most from this category