News


యస్‌ బ్యాంక్‌ 4.50శాతం అప్‌

Wednesday 26th September 2018
news_main1537943137.png-20588

ముంబై:- కొత్త ఛైర్మన్‌ నియమకానికి బోర్డు ‘‘రీసెర్చ్‌&సెలక్షన్‌ కమిటీ’’ని ఏర్పాటు చేయడంతో యస్‌ బ్యాంకు షేరు బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 4.50శాతం ర్యాలీ చేసింది. యస్‌ బ్యాంక్‌ మంగళవారం సాధారణ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు రీసెర్చ్‌&సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. గతం వారంలో కంపెనీ సీఈవోగా రాణా కపూర్‌ పునర్నియామకాన్ని ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్న రాణాకపూర్‌ నియామకాన్ని 2019 సెప్టెంబర్‌30 వరకు పొడిగించడానికి ఆర్‌బీల, ఎక్చే‍్చంజ్‌ల అనుమతి కోరాలని బోర్డు నిర్ణయించింది. మరోవైపు పలు బ్రేకరేజ్‌ సంస్థలు కూడా యస్‌ బ్యాంక్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మొత్తం 46 రేటింగ్‌ సంస్థలో 31 రేటింగ్‌ సంస్థలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను, 10 రేటింగ్‌ సంస్థలు ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను, 5రేటింగ్‌ సంస్థలు ‘‘సెల్‌’’ రేటింగ్‌ను కేటాయించాయి.  ఈ సానుకూల పరిణామాలతో నేపథ్యంలో నేడు యస్‌ బ్యాంకు షేరు బీఎస్‌ఈలో 2.20శాతం లాభంతో రూ.224.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరగడం షేరు 4.50శాతం వరకు లాభపడి రూ.229.55ల  వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 11:30నిల.లకు షేరు గత ముగింపు ధర(రూ.291.85)తో పోలిస్తే 2.65శాతం లాభంతో రూ.225.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.198.65 రూ.404.00లుగా నమోదయ్యాయి.You may be interested

కేఈఐటీ 17శాతం క్రాష్‌..!

Wednesday 26th September 2018

ముంబై:- ఐటీ రంగంలో సేవలు అందించే కేపీఐటీ టెక్నాలజీస్‌ షేరు బుధవారం 17శాతం నష్టపోయింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో కేపీఐటీ షేరు రూ.268.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కారణంగా భారీ లాభపడిన ఐటీ షేర్లలో నేడు లాభాల స్వీకరణ జరుగుతోంది. తెలియని కారణాలతో నేటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈలో కేపీఐటీ 17శాతం నష్టపోయి 222.65 వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు షేరు గతముగింపు

బ్రోకరేజ్‌లు మక్కువ చూపుతున్న టాప్‌ టెన్‌ స్టాక్స్‌!

Wednesday 26th September 2018

ఏడాది కాలంలో దాదాపు 60 శాతం వరకు రాబడినిచ్చే సత్తా ఉన్న పది స్టాకుల్లో బ్రోకరేజ్‌లు పొజిషన్లు తీసుకుంటున్నాయి. వాటి వివరాలు.. 1. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 352. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థ ఈ కౌంటర్లో కవరేజ్‌ ఆరంభించింది. రిటైల్‌ ఇన్వెస్టింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో బలమైన సంస్థ. పోటీ ఎక్కువగా ఉన్నా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. పొదుపులు పెట్టుబడులుగా మారతుండడం కంపెనీకి కలిసివచ్చే అంశం. 2. ఎన్‌ఓసీఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 256.

Most from this category