News


యస్‌ బ్యాంక్‌ 17.50శాతం అప్‌

Thursday 17th October 2019
Markets_main1571305167.png-28953

ప్రముఖ పారిశ్రామికవేత్తలు సునీల్‌ మిట్టల్‌, సునీల్‌ ముంజల్‌ యస్‌బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వెలుగులోకి రావడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 17.50శాతం లాభపడింది. నేడు ఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.41.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకులో వాటా కొనుగోలుకు సంబంధించి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, చర్చలు విజయవంతమైనట్లైతే.., మిట్టల్‌, ముంజల్‌ 5శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు నిన్న ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ అధికారి ప్రతినిధి ఈ వార్తలను ఖండించారు.    ‘‘యస్‌ బ్యాంక్‌లో సునిల్‌ భారతి మిట్టల్‌ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తం’’ అని వివరణనిచ్చారు. అలాగే ఈ కథనంపై బీఎస్‌ఈ ఎక్స్చేంజ్‌ సైతం యస్‌బ్యాంక్‌ వివరణ కోరింది. కొనుగోలును ఖండన చేసినప్పటికీ.., నేడు యస్‌బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఒకదశలో ఈ షేర్లు 17.50శాతం లాభపడి రూ.48.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.3:00లకు షేర్లు క్రితం ముగింపు(రూ.41.05)తో పోలిస్తే 16.50శాతం లాభంతో రూ.47.80లు వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.00లు, రూ.286.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

బాలీవుడ్‌ సినిమాలు హిట్‌..పీవీఆర్‌ ఫలితాలు సూపర్‌ హిట్‌!

Thursday 17th October 2019

  సూపర్‌ 30, మిషన్‌ మంగళ్‌, చిచ్చోరే వంటి సినిమాలు బాక్స్‌ ఆఫిస్‌ వద్ద మంచి వసూల్‌ సాధించడంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో పీవీఆర్‌ మంచి ప్రదర్శనను చేసింది. ఆర్థిక సంవత్సరం 2020 సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఏకికృత నికర లాభం 34.98 శాతం పెరిగి రూ. 47.88 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 35.47 కోట్లుగా నమోదైంది. కాగా విశ్లేషకులు

29,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ!

Thursday 17th October 2019

  బ్యాంకింగ్‌ షేర్లలో విపరీతంగా కొనుగోళ్ళు జరుగుతుండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.30 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 450.25 పాయింట్లు లేదా 1.58 శాతం లాభపడి 28,989.05 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 28,596.35 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఈ ఇండెక్స్‌, 29,049.05 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో యెస్‌ బ్యాంక్‌ 16.69 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 9.42

Most from this category