10శాతం పెరిగిన యస్‌బ్యాంక్
By Sakshi

ప్రైవేట్రంగానికి చెందిన యస్‌బ్యాంక్ షేర్లు మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 7శాతం లాభపడ్డాయి. నేడు ఎన్ఎస్ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.53.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమెర్ గ్రూప్‌నకు 6.4 ఎకరాల భూమిలో 50శాతం వాటాను బ్యాంకు టేకోవర్ చేయనునంది. దాని జాయింట్ వెంచర్ కంపెనీ రేడియస్ డెవలపర్స్ రూ .478 కోట్లకు పైగా బకాయిలు చెల్లించనందుకు యస్‌బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో నేడు యస్‌బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ బ్యాంకు షేర్లు 10 శాతం ర్యాలీ చేసి రూ.56.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఉదయం గం. 10:30ని.లకు షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 7.40శాతం లాభంతో రూ.55.35 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేర్ల ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.00లు రూ.286.00లుగా నమోదయ్యాయి.
You may be interested
బ్యాంక్ నిఫ్టీ జోరు
Tuesday 22nd October 2019దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సెషన్లో ప్రతికూలంగా ట్రేడవుతున్నప్పటికి బ్యాంకింగ్ షేర్లు మాత్రం సానుకూలంగా కదులుతున్నాయి. ఉదయం 10.57 సమయానికి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 218.10 పాయింట్లు లాభపడి 29,338.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్ షేర్లయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.47 శాతం లాభపడి రూ. 1,234.75 వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్ 1.70 శాతం లాభపడి రూ. 445.25 వద్ద, యాక్సిస్ బ్యాంక్ 1.03 శాతం
ఇన్ఫోసిస్‌పై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్?...
Tuesday 22nd October 2019విజిల్‌బ్లోయర్స్ పేరిట కొందరు ఉద్యోగులు ఇన్ఫీమేనేజ్మెంట్పై చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మంగళవారం షేరు దాదాపు 15 శాతం వరకు పతనమైంది. ఈ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ వీటిని కంపెనీ ఆడిట్ కమిటీ ముందుంచామని తెలిపింది. కమిటీకి డీ సుందరమ్ అధ్యక్షత వహిస్తుండగా, రూపా కుద్వా, పునీత్‌కుమార్ సిన్హాలు స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత సంక్షోభ నేపథ్యంలో ఇన్ఫీ షేరుపై ప్రముఖ బ్రోకరేజ్‌ల స్పందన ఇలా