News


యస్‌ బ్యాంకు విషయంలో ఏం చేయాలి..?

Friday 18th October 2019
Markets_main1571421524.png-28989

యస్‌ బ్యాంకు షేరు రెండు రోజుల్లో 25 శాతం ర్యాలీ చేసింది. భారతీ సునీల్‌ మిట్టల్‌, ముంజాల్‌లు బ్యాంకులో వాటా తీసుకునేందుకు ఆసక్తితో ఉన్నట్టు వచ్చిన వార్తలే కారణమా? లేక బ్యాంకు నిధుల సమీకరణ ప్రయత్నాలపై ఉన్న నమ్మకంతో జరిగిన కొనుగోళ్లే కారణమా..? కారణాలేమైనా కావచ్చు. బ్యాంకు సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలను ఇంకా ‍ప్రకటించాల్సి ఉంది. అలాగే, నిధుల సమీకరణ ప్రయత్నాలకు కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇన్వెస్ట్‌ చేసే వారు వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. నిపుణులు మాత్రం బ్యాంకు ఫండమెంటల్స్‌ కాస్త మెరుగుపడుతున్నాయంటున్నారు. ‘‘నిజంగానే ఫండమెంటల్స్‌ మెరుగుపడ్డాయి. నిధుల సమీకరణ వ్యయం తక్కువగా ఉంది. బ్యాంకు నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉంది. అతిపెద్ద ఇన్వెస్టర్ల విక్రయాల కారణంగా నెలకొన్న బలహీనత ముగిసిపోయింది. ఎందుకంటే ఎఫ్‌ఐఐల వాటా కొంత తగ్గింది’’ అని ఐఐఎఫ్‌ఎల్‌ మార్కెట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ అన్నారు. 

 

‘‘బ్రోడర్‌ మార్కెట్‌ మంచి పనితీరు చూపించే విధంగా ఉంది. కనుక ట్రేడ్‌పై రిస్క్‌ అధికంగా ఉంటుంది. ఇప్పటికే స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, కొనసాగొచ్చు. ఎందుకంటే ప్రతికూలతలను స్టాక్‌ సర్దుబాటు చేసుకుంది. వచ్చే ఆరు నెలలకు ఈ స్టాక్‌ రూ.75ను చేరుకోవచ్చు. ఇన్వెస్టర్లు మార్కెట్‌తో పోలిస్తే తక్కువ పనితీరు చూపించిన ఆర్‌బీఎల్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు వంటి వాటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు’’అని సంజీవ్‌భాసిన్‌ వివరించారు. అయితే, యస్‌ బ్యాంకు స్టాక్‌ ధరలో తీవ్ర అస్థిరతలు నిధుల సమీకరణ ప్రయత్నాలకు సవాలుగా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. యస్‌ బ్యాంకు ప్రస్తుత మార్కెట్‌ విలువకు సమానమైన నిధులు వచ్చే రెండు మూడేళ్ల కాలంలో అవసరమవుతాయని, పుస్తక విలువకు దిగువన ఈ స్థాయిలో నిధుల సమీకరణ మైనారిటీ వాటాదారుల ప్రయోజనానికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

 

‘‘అధిక అమ్మకాలు ఆగిపోవడం సానుకూలమే. ఇప్పుడు రెండు ముఖ్యమైన సంకేతాలను గమనించాల్సి ఉంటుంది. ఒకటి క్యూ2 త్రైమాసిక ఫలితాలు. రెండోది నిధుల సమీకరణలో ప్రగతి’’అని టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ వ్యవస్థాపకుడు సమీర్‌ కల్రా వివరించారు. ఈ స్టాక్‌కు ఆయన కొనుగోలు రేటింగ్‌ కూడా ఇచ్చారు. సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాల తర్వాతే బ్యాంకుకు సంబంధించి స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బ్యాంకు ఫండమెంటల్స్‌ మెరుగుపడుతున్నాయా లేక క్షీణిస్తున్నాయా అన్నది సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలతో వెలుగు చూస్తుందని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఈక్విటీ అనలిస్ట్‌ జైకిషన్‌ పార్మర్‌ పేర్కొన్నారు. ‘‘రూ.30 స్థాయి నుంచి ఇంత వేగంగా వెనక్కి రావడంతో షార్ట్‌ సెల్లర్లు పూర్తిగా ఇరుక్కుపోయారు. షార్ట్‌ కవరింగ్‌తో మంచి మూమెంటమ్‌ ఏర్పడింది. ఇదే ఒరవడి స్టాక్‌ను తదుపరి నిరోధ స్థాయిలు అయిన రూ.58, రూ.72 స్థాయిలకు తీసుకెళ్లొచ్చు’’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ పేర్కొన్నారు.You may be interested

రిలయన్స్‌ రికార్డ్‌ లాభం రూ.11,262 కోట్లు

Saturday 19th October 2019

-ఈ క్యూ2లో అత్యధిక త్రైమాసిక లాభం  -రిటైల్‌, జియోల జోరుతోనే భారీ లాభాలు  -5 శాతం వృద్ధితో రూ.1,63,754 కోట్లకు ఆదాయం  -ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి రిలయన్స్‌ షేర్‌  -9 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ !  న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్‌ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు

వచ్చే దీపావళికి బ్రోకరేజీల టాప్‌ పిక్స్‌

Friday 18th October 2019

గత దీపావళి నుంచి దేశీయ ఈక్విటీలు తీవ్ర అస్థిరతలు చవిచూశాయి. ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ, ఆర్థిక వృద్ధి మందగమనం, బలహీన ఫలితాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ మందగమనంపై ఆందోళనలు ఇలా ఎన్నో అంశాలు ఇందుకు కారణమయ్యాయి. అయితే, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత ఈ నష్టాలను మార్కెట్లు గణనీయంగా పూడ్చుకున్నాయి. దీంతో గత దీపావళి నుంచి చూస్తే సూచీలు 9 శాతం పెరిగాయి. కార్పొరేట్‌ పన్ను కోత, ఆర్‌బీఐ

Most from this category