News


నిధుల సమీకరణ..యస్‌ బ్యాంక్‌ 5% అప్‌

Wednesday 27th November 2019
Markets_main1574826656.png-29887

నిధుల సమీకరణ కోసం యస్‌ బ్యాంక్‌ బోర్డు డైరక్టర్లు శుక్రవారం సమావేశం కానున్నారు. కొత్తగా ఈక్విటీల ఇష్యు చేసి నిధులను సమీకరించాలని బ్యాంక్‌ బోర్డు భావిస్తోంది. కాగా గతంలో 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల కోసం అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ నుంచి బైండింగ్‌ ఆఫర్‌ వచ్చిందని బ్యాంక్‌ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. యస్‌ బ్యాంక్‌ నిధుల సమీకరణ గురించి వార్తలు వెలువడడంతో ఈ బ్యాంక్‌ షేరు బుధవారం సెషన్లో 5.05 శాతం లాభపడి రూ. 66.60 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో ఈ షేరు రూ. 63.40 వద్ద ముగిసింది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు

Wednesday 27th November 2019

గత సెషన్‌లో జీవిత కాల గరిష్ఠాన్ని ఏర్పరిచిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, బుధవారం సెషన్‌లో ఆ గరిష్ఠాన్ని అధిగమించి మరొక కొత్త రికార్డును ఏర్పరిచింది. గత సెషన్‌లో 31,718.35 పాయింట్ల వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌ బుధవారం సెషన్‌లో 31,832.75 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయంలోనే గత సెషన్‌లో ఏర్పరిచిన 31,796.20 స్థాయిని అధిగమించి 31,893.50    పాయింట్ల వద్ద కొత్త జీవిత కాల గరిష్ఠానికి చేరుకుంది.

రూపాయి... రెండు వారాల గరిష్టం @71.50

Wednesday 27th November 2019

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం రెండు వారాల గరిష్టం 71.50 స్థాయికి చేరింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 24 పైసలు బలపడింది. అక్టోబర్‌ 17 తరువాత రూపాయి ఒకేరోజు 24 పైసలు బలపడ్డం ఇదే తొలిసారి.  దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ట్రేడింగ్‌లో 71.49-71.68 శ్రేణిలో తిరిగింది.

Most from this category