News


యస్‌ బ్యాంకుకు ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..?

Wednesday 11th December 2019
Markets_main1576088140.png-30178

దేశంలో ఐదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యస్‌ బ్యాంకు నిధుల కోసం దాహం దాహం అంటూ అలమటిస్తుంటే... పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ, పేరున్న ఇన్వెస్టర్లు ముఖం చాటేసిన పరిస్థితి. కెనడాకు చెందిన ఎర్విన్‌సింగ్‌ బ్రెయిచ్ (1.2 బిలియన్‌ డాలర్లు), సిటాక్స్‌ హోల్డింగ్స్‌ (500 మిలియన్‌ డాలర్లు) మాత్రం పెద్ద మొత్తంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. అదే సమయంలో దేశీయంగా పేరున్న ఆదిత్య బిర్లా ఫ్యామిలీ హౌస్‌ కేవలం 25 మిలియన్‌ డాలర్లకే ఆఫర్‌ ఇచ్చింది. పేరున్న పెద్ద ఇన్వెస్టర్లు వ్యూహాత్మక వాటా తీసుకునేందుకు ముందుకు రాకపోవడానికి కారణాలపై విశ్లేషకుల అభిప్రాయాలు..

 

ఎన్‌పీఏలు
మొం‍డి బకాయిలు అధిక స్థాయిల్లో ఉండడంతో వీటికి కేటాయింపుల భారాన్ని దేశీయ బ్యాంకులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో బ్యాలన్స్‌ షీట్లలో తక్కువ ఎన్‌పీఏలున్న బ్యాంకుల పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. యస్‌ బ్యాంకు 2019-20 మొదటి రెండు త్రైమాసికాల్లో రూ.12,175 కోట్ల మేర ఎన్‌పీఏలను కొత్తగా చూపించింది. ఇతర ఏ ‍ప్రైవేటు బ్యాంకుతో చూసినా చాలా ఎక్కువ. 

 

లోపాలు
యస్‌ బ్యాంకు ఎన్‌పీఏ లెక్కల్లో లోపాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో బ్యాంకు వాస్తవంగా చూపించిన ఎన్‌పీఏలకు, ఆర్‌బీఐ ఆడిట్‌లో లెక్కలకు మధ్య వ్యత్యాసం రూ.3,277 కోట్లుగా లెక్క తేలింది. ఇందులో నికర ఎన్‌పీఏలు రూ.2,299 కోట్లు. వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో యస్‌ బ్యాంకు ఎన్‌పీఏల లెక్కల్లో అంతరాలు బయటపడ్డాయి.

 

లిక్విడిటీ
యస్‌ బ్యాంకు ఇష్యూయర్‌ రేటింగ్‌, డిపాజిట్‌ రేటింగ్‌లను మూడిస్‌ గత వారం డౌన్‌గ్రేడ్‌ చేసింది. బ్యాంకు అవుట్‌లుక్‌ను నెగెటివ్‌కు మార్చింది. ఇది బ్యాంకు నిధుల సమీకరణపై ప్రభావం చూపించేదే.

 

ఇప్పట్లో తీరేవి కావు..
బ్యాంకు అనుకునట్టు ఒకవేళ రూ.2 బిలియన్‌ డాలర్లు సమకరించినా.. బ్యాంకు క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం తీసుకుంటుందని మాక్వేర్‌ అంచనా. బ్యాంకుకు వచ్చే 18 నెలల్లో 3-3.5 బిలియన్‌ డాలర్ల నిధుల అవసరం అవుతుంది. తాజా ఎన్‌పీఏలను కట్టడి చేయలేకపోతే.. అదే పనిగా నిధుల సమీకరణ చేయాల్సి రావచ్చు.

 

విచారణ
యస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ హయాంలో కొన్ని రుణాల పునర్‌వ్యవస్థీకరణలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ప్రజావేగు ఆరోపించడం జరిగింది. దీనిపై జేఎల్‌ఎన్‌ యూఎస్‌ అండ్‌ కో ఆడిట్‌ నిర్వహణ ఇంకా పూర్తి కాలేదు.You may be interested

అందరివాడు .. దాస్‌

Thursday 12th December 2019

ఆర్‌బీఐ గవర్నర్‌గా ఏడాది     దేశీ బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ బాధ్యతలు చేపట్టి సంవత్సరమవుతోంది. గతేడాది డిసెంబర్‌ 12న ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ అర్ధాంతరంగా నిష్క్రమించిన తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలో దాస్‌ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్‌ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారాయన.  1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన దాస్‌.. గతంలో

16 నుంచి ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ ఇష్యూ

Wednesday 11th December 2019

ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ రూ.1,500 కోట్ల వరకు నిధులు సమీకరించే లక్ష్యంతో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) ఇష్యూను చేపట్టింది. ఈ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభమైన 30వ తేదీన ముగుస్తుంది. అనంతరం ఎన్‌సీడీలను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ చేయనున్నారు. కనీసం రూ.500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక. అధికంగా స్పందన వస్తే.. అప్పుడు అదనంగా మరో రూ.1,000 కోట్లను సమీకరించనుంది. ఇష్యూ ద్వారా సమీకరించే

Most from this category