News


యస్‌బ్యాంక్‌ 19.50శాతం క్రాష్‌

Wednesday 11th December 2019
news_main1576038610.png-30170

యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి కొనసాగుతుండంతో ఈ బ్యాంక్‌ షేరు బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి కల్లా 19.50శాతం నష్టపోయింది. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో సైటాక్స్‌ హోల్డింగ్స్‌, సైటాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన 50 కోట్ల డాలర్లకు సుముఖత చూపుతున్నట్లు బ్యాంక్‌ అధికారులు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చారు. అలాగే ఎర్విన్‌ సింగ్ బ్రెయిచ్‌/ఎస్‌పీజీసీ హోల్డింగ్‌ ప్రతిపాదించిన 1.2బిలియన్‌ డాలర్ల బిడ్డింగ్‌ ఆఫర్‌పై డైరెక్టర్ల బోర్డు ఇంకా పరిశీలన జరుపుతుందని పేర్కోంది. వాస్తవానికి 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని యస్‌బ్యాంక్‌ ఆశించింది. పెట్టుబడులపై అనిశ్చితి ఇంకా కొనసాగుతుండటంతో నేడు బీఎస్‌ఈలో బ్యాంకు షేరు 2.50శాతం నష్టంతో రూ.50ల దిగువున రూ.49.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దాదాపు 19.50శాతం నష్టపోయి రూ.40.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.50.55)తో పోలిస్తే 15.63 శాతం నష్టంతో రూ. 42.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.46.10, రూ.49.30లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఇన్ఫీ ఉద్యోగులకు బొనాంజా!

Wednesday 11th December 2019

డిజిటల్‌ నైపుణ్యాలుంటే నజరానాలు దాదాపు 25000 మంది మిడ్‌లెవల్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, వేతనాల పెంపునందించే ఒక టాలెంట్‌ ప్లాన్‌ను ఇన్ఫోసిస్‌ ఆరంభించింది. సరికొత్త డిజిటల్‌ విభాగాల్లో నైపుణ్యాలు సంపాదించినవారిని గుర్తించి నజరానాలు అందించనుంది. డిజిటల్‌ విభాగంలో మరింత దూసుకుపోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే డిజిటల్‌ నైపుణ్యాలున్నవారికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలు తమ సాం‍ప్రదాయక వ్యాపారంలో పెద్దగా పురోగతి చూపలేకపోతున్నాయి. అందుకే కంపెనీలన్నీ ఇప్పుడు డిజిటల్‌

వొడాఫోన్‌ఐడియా ఆస్తుల విక్రయ సన్నాహాలు!

Wednesday 11th December 2019

ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించేందుకు బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తో, డేటా సెంటర్‌ను విక్రయించేందుకు ఎడెల్‌వీజ్‌ గ్రూప్‌తో వొడాఫోన్‌ఐడియా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఏజీఆర్‌ తదితర బకాయిలను జనవరి కల్లా చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో కంపెనీ 250 కోట్ల డాలర్లను సమీకరించాల్సి ఉంది. ఇందుకోసం వివిధ అసెట్స్‌ను విక్రయించేందుకు నిర్ణయించింద. బ్రూక్‌ఫీల్డ్‌కు 156000 కిలోమీటర్ల ఆప్టిక్‌ ఫైబర్‌ విక్రయానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఇందుకు బోఫాఎంఎల్‌, మోర్గాన్‌స్టాన్లీ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయని సంబంధిత

Most from this category