News


యస్‌ బ్యాంక్‌ మరోసారి నిధుల సమీకరణ ప్రయత్నాలు

Wednesday 4th March 2020
news_main1583313510.png-32274

  • 52వారాల కనిష్టానికి షేరు

మూలధన నిధులను పెంచుకునేందుకు యస్‌ బ్యాంక్‌ యాజమాన్యం మ్యూచువల్‌ ఫండ్లను సంప్రదించినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఈ బ్యాంక్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో దాదాపు 8.50శాతం నష్టాన్ని చవిచూసింది. యస్‌బ్యాంక్‌ సుమారు 300-500 మిలియన్‌ డాలర్ల విలువైన తాజా ఈక్విటీ మూలధనాన్ని మ్యూచువల్‌ ఫండ్ల నుంచి సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు  బిజినెస్‌ స్టాండర్డ్‌ వార్తకథనాన్ని ప్రచురించింది. ఈ అంశంపై మ్యూచువల్‌ ఫండ్ల సంస్థలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అయితే ఆఫర్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాయని కథనంలో తెలిపింది. 

నేడు యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో రూ.31.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిధుల సమీకరణ ప్రయత్నాల వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒకదశలో 8.32శాతం నష్టాన్ని చవిచూసి రూ.28.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు మునుపటి ముగింపు(31.25)తో పోలిస్తే 7.50శాతం నష్టంతో రూ.28.90  వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.28.65 రూ.285.90లుగా నమోదయ్యాయి.

మరోవైపు యస్‌ బ్యాంక్‌ నిధుల సేకరణలో విఫలమైతే ఆర్‌బీ ఈసారి కఠినమైన చర్యలు తీసుకోవచ్చని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యస్‌ బ్యాంక్‌ 2బిలియన్‌ డాలర్ల నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో చాలామంది ఇన్వెస్టర్లు ఈ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఇటీవల కథనాలు వెల్లడయ్యాయి. 

హిందూజా గ్రూప్‌ ... ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సెర్బెరస్ క్యాపిటల్ మేనేజ్మెంట్‌తో జట్టుకట్టి యస్‌బ్యాంక్‌లో నిర్ణయాత్మకమైన వాటాను కొనుగోలు చేయవచ్చని గతనెలలో మీడియా కథనాలు వెల్లడయ్యాయి. అయితే ఇటు యస్‌బ్యాంక్‌ గానీ, అటు హిందూజా గ్రూప్‌ గానీ ఈ వాటా విక్రయ అంశంపై స్పందించేందుకు నిరాకరించాయి. 

నాలుగు ప్రధాన ఇన్వెస్టర్లు ధాఖలు చేసిన నాన్‌ బిడ్డింగ్‌ ఆసక్తి దరఖాస్తులను సమీక్షిస్తున్నందున ఈ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటను వాయిదా వేస్తున్నట్లు యస్‌బ్యాంక్‌ గతంలో ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. జేఎస్‌ ఫ్లవర్స్‌అండ్‌ కో, టిల్‌డెక్‌ పార్క్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట​, ఓహెచ్‌ఏ ఎల్‌ఎల్‌పీ, సిల్వర్‌ పాయింట్‌ కంపెనీలు నాన్‌ బిడ్డింగ్‌ దరఖాస్తులను సమర్పించిన కంపెనీలుగా ఉన్నాయి. You may be interested

చౌక నిధులతో బబుల్‌ !

Wednesday 4th March 2020

వడ్డీ రేట్లను తగ్గిస్తున్న కేంద్ర బ్యాంకులు  2008లో పరిస్థితులు తలెత్తవచ్చు రెండేళ్లలో బబుల్‌ ఏర్పడే అవకాశం - జిమ్‌ రోజర్స్‌, రోజర్స్‌ హోల్డింగ్స్‌ పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరోసారి నమ్మశక్యంకాని స్థాయిలో తగ్గిస్తూ వెళుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు మేలు చేయదంటున్నారు రోజర్స్‌ హోల్డింగ్స్‌ చైర్మన్‌ జిమ్‌ రోజర్స్‌. దీంతో రెండేళ్లలో  గాలి బుడగ(బబుల్‌) పరిస్థితులు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఈక్విటీ మార్కెట్లు, బంగారం తదితర అంశాలపై

కరోనా ఎఫ్‌క్ట్‌: భారత్‌ వైపు చూస్తున్న ఎంఎన్‌సీలు!

Wednesday 4th March 2020

కరోనావైరస్‌ ప్రభావంతో మల్టీ నేషనల్‌ కంపెనీ(ఎంఎన్‌సీ)లు అన్ని ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. కోవిడ్‌-19 దాటికీ చైనా మార్కెట్‌ అతలాకుతలమవ్వడం, దీనిపై ఆధారపడ్డ కంపెనీలన్నీ ఆర్థికంగా నష్టపోతుండడంతో... గ్లోబల్‌ కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా వైపు చూస్తున్నాయని యూబీఎస్‌ తాజాగా ఇచ్చిన నివేదికలో వెల్లడించింది.కాగా యూబీఎస్‌ గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో 450 మంది సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌లను సంప్రదించి ఈ నివేదికను

Most from this category