News


మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైన యస్‌ బ్యాంక్‌

Friday 16th August 2019
Markets_main1565941843.png-27810

ఇటీవల క్యూఐపీ ఇష్యూ విజయవంతమైన నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ మరో 600 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.43 కోట్లు) నిధుల సమీకరణకు రంగం సిద్ధం చేస్తోంది. రుణదాతలు సూచించిన మూలధన పెంపు ప్రణాళికల్లో భాగంగా పెద్దస్థాయి ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తం నిధులను సమీకరించేందుకు యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో ప్రతికూల వాతవరణం ఉన్నప్పటికీ బ్యాంకు 270 మిలియన్‌ డాలర్ల క్యూఐపీ ఇష్యూకు విజయవంతంగా పూర్తి చేసింది. ఇది బ్యాంకుకు  మరింత నమ్మకాన్ని పెంపొందించింది. ప్రస్తుతం బ్యాంకు యోచిస్తున్న 600 మిలియన్ డాలర్ల మూలధన సేకరణ ప్రణాళిక 20శాతానికి పైగా వాటాను తగ్గింపునకు దారితీస్తుంది. పాత ప్రమోటర్లు అధిక మొత్తం వాటాను తగ్గించుకోనుండటంతో కొత్త ఇన్వెస్టర్లు బ్యాంకులో గణనీయమైన హోల్డింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ప్రతిపాదిత వాటా తగ్గింపు భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి బ్యాంక్ వృద్ధికి తోడ్పడే వ్యూహాత్మక పెట్టుబడిదారులను ఎన్నుకునేందుకు ఇది సరియైన అవకాశం. తాజా క్యూఐపీ బ్యాంక్ సీఈటీ-1 నిష్పత్తిని 8.6 శాతానికి పెంచుతుందని వారు అభిప్రాయపడ్డారు. రానున్న వారాల్లో యస్‌ బ్యాంకు మరో తాజా మూలధన నిధుల పెంపు ప్రణాళిక ఆమోదం కొరకు షేర్లహోల్డర్ల అనుమతులు కోరనుందని వారు తెలిపారు. ఈ ఇష్యూలో గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌ ఆఫ్‌ నార్వే, బ్రిటీష్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజ సంస్థ యాష్‌మోర్‌ గ్రూప్‌, ఆదిత్యా లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు పాల్గొనే అవకాశం ఉందని, షేరు ధరను బట్టి బ్యాంకు ఇష్యూను పరిమాణాన్ని నిర్ణయిస్తుందని వారు తెలిపారు. 
 

ఆగస్ట్‌ 09-14 తేదిల్లో బ్యాంక్‌ 270 మిలియన్‌ డాలర్ల క్యూఐపీ ఇష్యూను పూర్తి చేసినట్లు బ్యాంకు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ ఇష్యూలో సొసైటీ జనరల్, కీ స్క్వేర్ మాస్టర్ ఫండ్ ఫండ్‌, బీఎన్‌పీ పారిభాస్‌ ఆర్బిట్రాజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ అడ్వాజేంట్‌ ఫండ్‌, స్క్వేర్ మాస్టర్ ఫండ్ ఫండ్‌- II తో పాటు ఇతర ఫండింగ్‌ సంస్థలతో పాల్గోన్నట్లు తెలుస్తోంది.

తాజా మూలధన నిధుల సమీకరణ అంశం తెరపైకి రావడంతో యస్‌ బ్యాంకు షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 6శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.76.55)తో పోలిస్తే 5.5శాతం లాభంతో రూ.80.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.70.55లు రూ.404.00లుగా నమోదయ్యాయి. You may be interested

క్షీణత నుంచి లాభాల్లోకి బ్యాంక్‌ షేర్లు

Friday 16th August 2019

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వలన దేశియ మార్కెట్లు శుక్రవారం నెగిటివ్‌గా ప్రారంభమై మధ్యాహ్నాం 1.17 సమయానికి పాజిటివ్‌లోకి మళ్లాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం 27920.30 పాయింట్ల వద్ద నెగిటివ్‌లో ప్రారంభమవ్వగా, మధ్యాహ్నాం 1.17 సమయానికి 170.60 పాయింట్లు లాభపడి 28189.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో ఈ ఇండెక్స్‌ 28019.20 ముగియగా, శుక్రవారం ట్రేడింగ్‌లో పతన స్థాయి నుంచి 270 పాయింట్లు పెరగడం గమనార్హం. ఈ

నష్టాల్లో కోల్‌ ఇండియా, జిందాల్‌ స్టీల్‌..

Friday 16th August 2019

అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో దేశియ మార్కెట్లు కూడా శుక్రవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో కదులుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మధ్యాహ్నాం 12.49 సమయానికి 0.87 శాతం నష్టపోయి 2,390.15 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 3.53 శాతం లాభపడి రూ. 1,321.00 వద్ద ట్రేడవుతుండగా, మిగిలిన షేర్లయిన జిందాల్‌ స్టీల్‌ 1.01 శాతం, కోల్‌ ఇండియా 0.67    శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లి.(హిసార్‌) 0.07

Most from this category