News


ఫలితాల సెగ...యస్‌ బ్యాంక్‌ 15 శాతం క్రాష్‌

Thursday 18th July 2019
Markets_main1563425098.png-27139

15శాతం క్షీణించిన షేర్లు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన ప్రైవేటు రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 15శాతం పతనమయ్యాయి. యస్‌ బ్యాంక్‌ నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. తొలి క్వార్టర్‌లో మొండి బకాయిల బెడద కొనసాగడం, ఆస్తుల నాణ్యత క్షీణించడటం పాటు మొండిబకాయిలకు అధిక ప్రోవిజన్లు కేటాయింపులతో రూ.95.56 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన రూ.1,265.67 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 92.4 శాతం తక్కువ. స్థూల ఎన్‌పీలు ఈ క్యూ1లో 5.01శాతంగా నమోదయ్యాయి. గత ఆ‍ర్థిక సంవత్సరంలో ఇదే క్యూ1లో 1.31శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.59 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.8,301.06 కోట్ల నుంచి రూ.9,105.79 కోట్లకు పెరిగింది. ఫలితాలు తీవ్రంగా నిరాశపర్చడంతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను భారీగా తగ్గించాయి. 
సీఎల్‌ఎస్‌ఏ:- వసూలు కాని రుణాలు, స్లిపేజ్‌లు అధికంగా పెరిగాయి. సీఎస్‌సీఏ(కరెంట్‌ అండ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ రేషియో) వృద్ధి చెందింది. ఆస్తుల నాణ్యత భారీగా క్షీణించింది. మూలధనాన్ని పెంచకోవడంతో పాటు సీఏఎస్‌ఏ వృద్ధి పెరుగుదలను అరికట్టాల్సి అవసరం ఉంది. గతంలో షేరుకు కేటాయించిన అవుట్‌ఫెర్మ్‌ఫామ్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు కొనుగోలు ధరను రూ.150ల నుంచి రూ.110కు పరిమితం చేసింది.

మోర్గాన్‌ స్టాన్లీ:- విశ్లేషకుల అంచనాల పూర్తిగా బలహీనంగా నమోదయ్యాయి.  స్లిపేజ్‌లు పెరిగాయి. గతంలో షేరుకు కేటాయించిన అండర్‌వెయిటేజ్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు కొనుగోలు ధరను రూ.120ల నుంచి రూ.95లకు పరిమితం చేసింది.
ఎడెల్వీజ్‌:-  ఆస్తుల నాణ్యత క్షీణించడటం, క్యాపిటల్‌ పొజిషన్లలో అనిశ్చితి, వృద్ధి బలహీనత, నికర వడ్డీ మార్జిన్లు తగ్గడం క్యూ1 ఫలితాలపై ప్రభావాన్ని చూపింది. గతంలో షేరుకు కేటాయించిన మెయిన్‌టెన్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు కొనుగోలు ధరను రూ.250ల నుంచి రూ.110కు పరిమితం చేసింది.
నోమురా:- అంచనాల పూర్తిగా నిరాశపరించింది. ఆస్తుల రుణ నాణ్యత బలహీనంగా ఉంది. బ్యాంకు యాజమాన్య పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. పునరుద్ధరణ సవాలుగా మారనుంది. గతంలో షేరుకు కేటాయించిన న్యూట్రల్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు కొనుగోలు ధరను రూ.230ల నుంచి రూ.110కు తగ్గించింది. 
అటు ఫలితాలు నిరాశపరచడంతో పాటు బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు గత ముగింపు ధర (రూ.98.45)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ.88.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై 15శాతం క్షీణించి రూ.83.70ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.9:50ని.లకు షేరు 10శాతం నష్టంతో రూ.88.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 83.70  రూ.404.00లుగా నమోదయ్యాయి.You may be interested

పసిడిలో లాభాల స్వీకరణ

Thursday 18th July 2019

ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పసిడి ఫ్యూచర్లు రెండు వారాల గరిష్టం నుంచి దిగివచ్చాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.25డాలర్‌ స్వల్పలాభంతో 1,424.55 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి అమెరికా హౌసింగ్‌ గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలకు అందుకోలేకపోవడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ భారీగా క్షీణించింది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు మరింత బలపడటం, అమెరికా చైనాల మధ్య వాణిజ్య

68.75 వద్ద రూపీ ప్రారంభం

Thursday 18th July 2019

రూపీ డాలర్‌ మారకంలో 0.04 శాతం బలహీనపడి 68.76 వద్ద గురువారం ట్రేడవుతోంది. విదేశి పెట్టుబడులు ఔట్‌ఫ్లో ఉండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 11 పైసలు కోల్పోయి 68.82 వద్ద ముగిసింది. దీంతో పాటు దేశియ మార్కెట్లలో మదుపర్లు జాగ్రత్త వహించడంతో రూపీ బలహీన పడింది. మేజర్‌ కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలహీన పడడంతో రూపీ కొంత వరకు కొలుకోగలిగింది. గత సెషన్‌లో ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌

Most from this category