News


నెలరోజుల కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Friday 6th December 2019
Markets_main1575617263.png-30092

  • మూడింగ్‌ రేటింగ్‌ కోతతో 9శాతం పతనమైన షేరు

యస్‌బ్యాంక్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 9శాతం నష్టపోయి నెలరోజుల కనిష్టానికి దిగివచ్చింది. ప్రముఖ బ్రోకరేజ్‌ మూడీస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.61.00 వద్ద ప్రారంభమైంది. నిర్థరక ఆస్తులు, తక్కువ లాస్‌-అబ్‌సోరింగ్‌ బఫర్‌లు బ్యాంక్‌ నిధుల సమీకరణ, ద్రవ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని రేటింగ్‌ తెలిపింది. ఈ కారణంగా మూడీస్‌... బ్యాంకు దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ ఇష్యూయర్‌ రేటింగ్‌ను 'బీఎ 3' నుండి 'బి 2' కి తగ్గించింది. అలాగే బ్యాంక్‌ రేటింగ్‌కు ‘‘అవుట్‌లుక్‌’’ రేటింగ్‌ను కేటాయించింది. రాబోయే కొద్ది త్రైమాసికాలలో బ్యాంక్ కొత్త మూలధనాన్ని సమకూర్చుకోకపోతే, 2019 సెప్టెంబర్ చివరినాటికి  బ్యాంక్  కామన్ ఈక్విటీ టైర్ -1 (సిఇటి 1) నిష్పత్తి 8.7 శాతం గణనీయమైన ఒత్తిడికి లోనవుతుందని మూడీస్ అభిప్రాయపడింది. అలాగే పరపతి, నిధులు, ద్రవ్యత మరింత క్షీణతకు లోనయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ తగ్గిపుతో యస్‌బ్యాంక్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 9శాతం నష్టపోయి రూ.56.50 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.62.10)తో పోలిస్తే 8శాతం నష్టంతో రూ.57 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిధుల సమీకరణ అంశం తెరపైకి రావడంతో షేరు క్రితం వారంలో దాదాపు 16శాతం లాభపడింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.05, రూ. 285.90లుగా నమోదయ్యాయి. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.25% క్రాష్‌

Friday 6th December 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి 1.32శాతం నష్టపోయింది. ఈ దఫా వడ్డీరేట్లపై ఎలాంటి మార్పు లేకుండా యథాతధంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో నిన్న ఆర్‌బీఐ పాలసీ కమిటి నిర్ణయం తీసుకోవడంతో బ్యాకింగ్‌ రంగ షేర్లు మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మిడ్‌సెషన్‌ను ప్రైవేట్‌ రంగ షేర్లలో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బ్యాంక్‌

కంపెనీల ఎబిటా వృద్ధిలో క్షీణత!

Friday 6th December 2019

మూడు రంగాల్లో తీవ్ర ఒత్తిడి క్రెడిట్‌ సూసీ పవర్‌, టెలికం, ఫైనాన్షియల్‌ రంగాల్లో తీవ్రమైన ఒత్తిడి ఉందని క్రెడిట్‌ సూసీ ఇండియా ఈక్విటీ రిసెర్చ్‌ హెడ్‌ ఆశిష​ గుప్తా చెప్పారు. ఇటీవల కాలంలో మొత్తం కార్పొరేట్‌ లాభాలే క్షీణతలో ఉన్నాయన్నారు. ఈ త్రైమాసికంలో కార్పొరేట్‌ ఇండియా సరాసరి ఎబిటా వృద్ధి 6 శాతానికి దిగివచ్చిందన్నారు. దీనికితోడు పలు త్రైమాసికాలుగా స్థిరంగా ఉన్న ఒత్తిడిస్థాయిలు ఈ త్రైమాసికంలో బాగా పెరిగాయన్నారు. ఇంట్రెస్ట్‌కవర్‌ నిష్పత్తి పైమూడు

Most from this category