News


రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ ఎఫెక్ట్‌: యస్‌బ్యాంక్‌ 7శాతం డౌన్‌

Friday 1st November 2019
Markets_main1572590388.png-29284

నేడే క్యూ2 ఫలితాల ప్రకటన 
ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ యస్‌బ్యాంక్‌ షేరుపై అండర్‌వెయిట్‌ రేటింగ్‌ను కేటాయించడంతో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 7శాతం నష్టపోయింది. యస్‌ బ్యాంకు నేడు బీఎస్‌ఈలో రూ.71.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నేడు(నవంబర్‌ 01) బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల కానునుండటం కూడా షేరు ట్రేడింగ్‌పై ఒత్తిడిని పెంచింది. ఫలితంగా ఇంట్రాడేలో షేరు 7శాతం నష్టపోయి రూ.65.60 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.
ఉదయం గం.11:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ70.45)తో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.67.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరసగా రూ.65.60లు రూ.71.85లుగా నమోదయ్యాయి.

బ్యాంకులో 1.2బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒక ఇన్వెస్టర్లు ముందుకురావడం పాజిటివ్‌ అంశమని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ఈ భారీ పెట్టుబడులు బ్యాంకు  సీఈటీ 1 నిష్పత్తిని 260 బీపీఎస్‌ల మేర మెరుగుపరుస్తుందని అంచనా వేస్తుంది. ఈ పెట్టుబడుల అంశం డౌన్‌సైడ్‌ ట్రెండ్‌ను పరిమితం చేస్తుందని, అయితే అప్‌సైడ్‌ లిమిట్‌ క్రమంగా టర్నఅరౌండ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. ఆర్థిక సమస్యలతో ఒత్తిడికి లోనవుతున్న రంగాలకు బ్యాంకు భారీ ఎత్తున రుణాలను కేటాయించింది. బ్యాంకుకు బలమైన రిటైల్ ఫ్రాంచైజ్, హై-మార్జిన్ గ్రోత్ ఇంజిన్ లేకపోవడంతో రుణాల వసూలకు మరింత సమయం పడుతుందని మోర్గాన్‌ తెలిపింది. ఈ ప్రతికూలాంశాల నేపథ్యంలో బ్యాంకు షేరుకు అండర్‌ వెయిట్‌ రేటింగ్‌ను కేటాయింపుతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.55లకు డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది.

రుణాల కేటాయింపులు తగ్గడం, డిపాజిట్ల వృద్ధి, ఆస్తి నాణ్యత పనితీరులో క్షీణత తదితర కారణాల నేపథ్యంలో బ్యాంకు క్యూ2 ఫలితాలు నిరుత్సాహపరచవచ్చని పటు బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ క్యూ2లో బ్యాంక్‌ రూ.1,264 కోట్ల నష్టాన్ని ప్రకటిస్తుందని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ప్రీ-ప్రోవిజన్‌ ఆపరేటింగ్‌ ఫ్రాఫిట్‌ తగ్గడం, నికర వడ్డీ ఆదాయం మరియు ఇతర ఆదాయాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఇదే క్యూ2లో బ్యాంక్‌ రూ.1,907.3 కోట్ల నష్టాన్ని నమోదు చేస్తుందని ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 



You may be interested

ఐఓసీపై బ్రోకరేజిల ‘బై’ కాల్‌

Friday 1st November 2019

దేశీయ ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 83 శాతం తగ్గి రూ. రూ.564 కోట్లుగా నమోదైంది. ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో ఈ కంపెనీ షేరు శుక్రవారం సెషన్లో 4 శాతం మేర నష్టపోయింది. అయినప్పటికి ఈ కంపెనీ షేరుపై బై కాల్‌ను బ్రోకరేజిలు కొనసాగిస్తున్నాయి. బై కాల్‌ను కొనసాగిస్తున్న విదేశీ బ్రోకరేజిలు.. నోమురా: కొనచ్చు; టార్గెట్‌ ధర:

స్వల్పకాలానికి స్టాక్‌ సిఫార్సులు

Friday 1st November 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం సెషన్లో లాభాలతో మొదలై, నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11.05 సమయానికి నిఫ్టీ 50 9.05 పాయింట్లు నష్టపోయి 11868.40 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 37.86 పాయింట్లు నష్టపోయి 40091.19 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. స్వల్పకాలానికి సంబంధించి విశ్లేషకులు ఇస్తున్న స్టాక్‌ సిఫార్సులు: కునాల్‌ బోత్రా, స్వతంత్ర మార్కెట్‌ విశ్లేషకులు: ఏసీసీ: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1625; స్టాప్‌ లాస్‌: రూ. 1550 బెర్జర్‌ పెయింట్స్‌: అమ్మొచ్చు; టార్గెట్‌ ధర:

Most from this category