News


యస్‌ బ్యాంక్‌ షేర్లకు సీజీ పవర్‌ షాక్‌ ..!

Tuesday 20th August 2019
Markets_main1566285675.png-27892

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ జరిపిన నేరపూరిత ఉదంతం యస్‌ బ్యాంక్‌ షేర్లకు షాక్‌ ఇచ్చింది. కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌పై ఆందోళనలు తెరపైకి రావడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం 6శాతం పతనయ్యాయి. సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీకి చెందిన ఉద్యోగులు కొందరు గత రెండేళ్లుగా అనధికారిక లావాదేవీలు జరిపినట్లు రిస్క్‌ అండ్‌ బ్యాలెన్స్‌ కమిటీ తెలిపింది. ఈ నేరపూరిత వ్యవహారం ద్వారా కంపెనీ అప్పులను తగ్గించి చూపడమే కాకుండా తన మాతృసం‍స్థ అవంత గ్రూప్‌లోని ఇతర కంపెనీలకు సైతం లబ్ది చేకూర్చినట్లు కమిటీ గుర్తించింది. దీంతో ఈ కంపెనీలో 13శాతం వాటా కలిగిన యస్‌ బ్యాంక్‌ షేర్లు  ప్రతికూలంగా స్పందించాయి. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనై 7.50శాతం నష్టపోయి రూ.71.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:15.ని.లకు షేరు గతముగింపు(రూ.76.7)తో పోలిస్తే 7శాతం నష్టంతో రూ.71.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఏడాది కాల వ్యవధిలో షేరు 60శాతం వరకు క్షీణించింది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.70.50 రూ.404.00లుగా నమోదయ్యాయి. 

ఇదే వ్యవహారంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న సీజీ పవర్‌ కంపెనీ షేర్లు 20శాతం క్షీణించి రూ.14.75 లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అ‍య్యాయి.



You may be interested

ఇండెక్స్‌ చూడొద్దు..మంచి షేర్లను అన్వేషించాలి

Tuesday 20th August 2019

ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్‌ ఎటువెలుతుందో అంచనా వేయడం కంటే నిర్దిష్ట స్టాక్స్‌లలో అవకాశాలను పరిశీలించడం మంచిదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెమాంగ్‌ జానీ ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వం చేతుల్లో మార్కెట్‌ ప్రదర్శన.. మందగమనాన్ని ఎదుర్కొంటున్న రంగాలకు ఉద్దీపనలను అందించడంతో పాటు పన్నులు, సర్‌చార్జీల నుంచి కొంత ఉపశమననాన్ని కలిగించేంత వరకు దేశియ మార్కెట్‌ అద్వాన్న ప్రదర్శననే చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో

బౌన్స్‌బ్యాక్‌ ఉంటుందా?

Tuesday 20th August 2019

తప్పదంటున్న నిపుణులు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో ఫ్యూచర్స్‌ మార్కెట్లో విపరీతంగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా మార్కెట్లు ఓవర్‌సోల్డ్‌ జోన్‌లోకి వెళ్లిపోయాయి. ఇలా జరిగినప్పుడు తమ పొజిషన్లను కవర్‌ చేయడానికి మళ్లీ కొనుగోళ్లు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది మొదలైతే మార్కెట్లలో మళ్లీ భారీ ర్యాలీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  మార్కెట్లో ఎఫ్‌పీఐలు లక్ష షార్ట్‌ పొజిషన్లు తీసుకున్నాయని, ఇది చాలా ఎక్కువని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎఫ్‌పీఐలు

Most from this category