News


యస్‌బ్యాంక్‌ 3.50శాతం డౌన్‌

Monday 23rd December 2019
Markets_main1577096337.png-30385

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జాబితా నుంచి తొలగించడంతో యస్‌ బ్యాంక్‌ సోమవారం ట్రేడింగ్లో 3.50శాతం నష్టపోయింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.50.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్‌ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్‌ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్‌ఈ చేర్చింది. ఫలితంగా ట్రేడింగ్‌ ఆరంభం నుంచి షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైయ్యాయి. ఒకదశలో 5శాతం నష్టపోయి రూ.50 దిగువుకు పతనమైన రూ.48.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మార్కెట్‌ ముగిసే సరికి 3.31శాతం నష్టపోయి రూ.49.65 వద్ద ఇంట్రాడే వద్ద స్థిరపడింది. కాగా షేరు ఏడాది షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.05 వద్ద, రూ.285.90 నమోదయ్యాయి. ఈ ఏడాది షేరు నేటి వరకూ కూడా 71శాతం పతనమైనప్పటికీ, చివరి 10 ట్రేడింగ్‌ సెషన్స్‌లో 10శాతం పెరిగింది. ప్రస్తుతం యస్‌బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.12,535.57 కోట్లుగా ఉంది.



You may be interested

ఒడిదుడుకుల మధ్య చివరికి నష్ఠాలు

Monday 23rd December 2019

పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ వీక్‌ మీడియా, ఆటో రంగాలు ప్లస్‌ గత వారం సరికొత్త రికార్డులతో దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఆద్యంతం​ఒడిదుడుకులను చవిచూశాయి. చివరికి స్వల్ప వెనకడుగుతో ముగిశాయి. సెన్సెక్స్‌ 39 పాయింట్లు క్షీణించి 41,643 వద్ద నిలవగా.. నిఫ్టీ 9 పాయింట్లు నీరసించి 12,2663 వద్ద స్థిరపడింది. గత వారం ర్యాలీ జరిగిందున, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా

2020లో కూడా పెద్దస్టాకులదే రాజ్యం!

Monday 23rd December 2019

నిపుణుల అంచనా ఈ ఏడాదిలాగానే కొత్త ఏడాదిలో కూడా పెద్ద స్టాకులదే రాజ్యమని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2019లో జరిగినట్లే కొన్ని లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే సూచీలను ముందుకు నడిపిస్తాయని అంచనా వేస్తున్నారు. ఎకానమీలో మందగమనం కొత్త ఏడాది కూడా కొనసాగవచ్చని, అందువల్ల ఇన్వెస్టర్లు ఎక్కువగా క్వాలిటీ షేర్లను ఎంచుకోవడం జరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి దీపేన్‌షా చెప్పారు. విదేశీ నిధులు సైతం లార్జ్‌క్యాప్స్‌లోకే ప్రవహిస్తాయన్నారు. ఈ ఏడాదిలో వృద్ధి నెమ్మదించినా సూచీలు

Most from this category