News


యస్‌ బ్యాంక్‌ బాండ్ల రద్దు- ఫండ్స్‌కు షాక్‌

Tuesday 10th March 2020
Markets_main1583823993.png-32387

పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ఇలా

రూ. 8,700 కోట్ల AT 1 బాండ్ల రద్దు
నష్టపోనున్న జాబితాలో..
ఆర్‌ఐఎల్, ఎల్‌అండ్‌టీ
బార్‌క్లేస్‌, బజాజ్‌ అలయెంజ్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టనున్న పునర్వ్యవస్థీకరణ చర్యలలో భాగంగా ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యస్‌ బ్యాంక్‌ జారీ చేసిన AT 1 బాండ్లు రద్దుకానున్నట్లు తెలుస్తోంది. దీంతో పలు మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు)తోపాటు.. పెన్షన్‌ ఫండ్స్‌, కార్పొరేట్స్‌ సైతం నష్టపోయే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. యస్‌ బ్యాంక్‌ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా వివరాల ప్రకారం నిప్పన్‌, కొటక్‌, ఫ్రాంక్లిన్‌ తదితర ఎంఎఫ్‌లతోపాటు.. బార్‌క్లేస్‌ బ్యాంక్‌, బజాజ్‌ అలయెంజ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తదితర 34 సంస్థలు నష్టపోనున్నట్లు వార్తలు పేర్కొంటున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

రూ. వేల కోట్లు
పునర్వ్యవస్థీకరణ ముసాయిదా అమలైతే.. సుమారు 34 సంస్థలు మొత్తంగా వేల కోట్ల పెట్టుబడులను నష్టపోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ. 8,700 కోట్ల విలువైన AT 1 బాండ్లను రద్దు చేసే అవకాశముంది. జాబితా ప్రకారం చూస్తే.. నిప్పన్‌ ఎంఎఫ్‌ రూ. 2500 కోట్లు, ఫ్రాంక్లిన్‌ ఎంఎఫ్‌ రూ. 590 కోట్లు, బార్‌క్లేస్‌ బ్యాంక్‌ రూ. 246 కోట్లు, కొటక్‌ ఎంఎఫ్‌ రూ. 130 కోట్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 130 కోట్లు చొప్పున కోల్పోనున్నాయి. ఇదే విధంగా రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌, యూటీఐ ఎంఎఫ్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, భారతీ ఏఎక్స్‌ఏ సైతం ఉన్నాయి. ఈ జాబితాలో పెన్షన్‌ ఫండ్స్‌ సైతం చోటు చేసుకున్నాయి. ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌హెచ్‌పీసీ, ఐవోసీ కంపెనీల ఉద్యోగులు, ఆఫీసర్ల పెన్షన్‌ ఫండ్స్‌తోపాటు.. ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ ఫండ్‌ సైతం కోట్ల సొమ్మును కోల్పోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు.

రిస్క్‌లతోనే
నిజానికి పెర్పెట్యువల్‌ బాండ్లు రిస్క్‌తో కూడుకున్నవని ఫండ్‌ హౌస్‌ నిపుణులు ఒకరు పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఈ సందర్భంగా ఈక్విటీలను పోలి ఈ బాండ్లలో అంతర్గతంగా ఉన్న రిస్కులను గమనించవలసి ఉన్నదని వ్యాఖ్యానించారు. సమస్యల్లో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ను నిలబెట్టేందుకు ఆర్‌బీఐ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తొలి దశకింద ఎస్‌బీఐ ఈక్విటీ ద్వారా రూ. 2450 కోట్లను యస్‌ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేయనుంది. మరోవైపు రూ. 8,700 కోట్ల విలువైన AT 1 బాండ్లను రద్దు చేసే అవకాశముంది. అయితే బాండ్ల పూర్తి రద్దును వ్యతిరేకిస్తూ యాక్సిస్‌ ట్రస్టీ సర్వీసెస్‌ ముంబై హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది. సాధారణ బాండ్లతో పోలిస్తే.. పెర్పెట్యువల్‌ బాండ్లలో రిస్కలు, ఈల్డ్స్‌ అధికంగా ఉంటాయని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. యస్‌ బ్యాంక్‌ AT 1 బాండ్లు రద్దయితే.. ఇకపై మధ్య, చిన్నతరహా కంపెనీలు పెర్పెట్యువల్‌ బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించడం కష్టతరంకావచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. You may be interested

ఆసియా రిచెస్ట్‌ మ్యాన్‌ హోదా కోల్పోయిన ముకేశ్అం‌బానీ!

Tuesday 10th March 2020

ఆయిల్‌, రిటైల్‌, టెలికంలతో పాటు వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తాజాగా తన స్థానాన్ని కోల్పోయారు. రెండోస్థానంలో ఉన్న అలీబాబా గ్రూపు అధినేత జాక్‌ మా మొదటిస్థానంలోకి వచ్చారు. కరోనా వైర స్‌(కోవిడ్‌-19) ధాటికీ ప్రపంచ దేశాల మార్కెట్లు కూప్పకూలుతున్నాయి. నిన్న ఒక్కరోజే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,942 పాయింట్లు కుప్పకూలింది. ఇది చరిత్రలోనే పాయింట్ల రీత్యా అత్యంత భారీ

చమురు ధరల పతనం ఏం​చెబుతోంది?

Tuesday 10th March 2020

దేశానికి ఎన్నో విధాల లాభం చమురు దేశాల ఆర్థిక వ్యవస్థలు డీలా ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధికి విఘాతం ప్రపంచంలోనే చమురు ఉత్పత్తికి రెండో పెద్ద దేశమైన సౌదీ అరేబియా.. ధరల యుద్ధానికి తెర తీయడంతో అంతర్జాతీయ స్థాయిలో సోమవారం స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. చమురు ఉత్పత్తిలో మూడో పెద్ద దేశం రష్యాపై ఆగ్రహంతో సౌదీ అరేబియా బ్యారల్‌ ధరలో 6-8 డాలర్ల చొప్పున డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాకుండా ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించింది. నిజానికి

Most from this category