News


యస్‌ బ్యాంక్‌ 9 శాతం అప్‌!

Tuesday 5th November 2019
Markets_main1572928327.png-29358

ఈ ఏడాది చివరినాటికి 1 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించనున్నామని యస్‌ బ్యాంక్‌ యాజమాన్యం ప్రకటించడంతో ఈ బ్యాంక్‌ షేరు గత కొన్ని సెషన్‌ల నుంచి కోలుకుంటుంది. అంతేకాకుండా సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా బల్క్‌ డీల్‌లో భాగంగా రూ. 86.89 కోట్ల విలువైన 1.30 కోట్ల షేర్లు లేదా 0.51 శాతం వాటాను సోమవారం కొనుగోలు చేశారు. ఈ అంశం కూడా బ్యాంక్‌ షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపడంతో మంగళవారం ట్రేడింగ్‌లో ఈ బ్యాంక్‌ షేరు విలువ 9 శాతం లాభపడి 70.30 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూ. 66.15 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్‌లో ఉదయం 9.55 సమయానికి 4.61 శాతం లాభపడి రూ. 69.20  వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఈక్విటీల ర్యాలీ: తగ్గిన పసిడి

Tuesday 5th November 2019

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతోంది. ఆసియా మార్కెట్లో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3.35డాలర్లు నష్టపోయి 1,507.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనాతో వాణిజ్య వివాదాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయనే సంకేతాలు బలపడటం, అమెరికా అక్టోబర్‌ వృద్ధి గణాంకాలతో పాటు చైనా తయారీ రంగం అంచనాలను మించి వృద్ధిని సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీలకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా నిన్న

ఈ స్టాకుల్లో పెరిగిన ఓపెన్‌ఇంట్రెస్ట్‌

Tuesday 5th November 2019

నవంబర్‌ సీరిస్‌లో సూచీలు కొత్త గరిష్ఠాలను చేరతాయని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. అయితే ర్యాలీ విస్తృతస్థాయిలో ఉండకపోవచ్చని, కొన్ని స్టాకులకే పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ సీరిస్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగిన షేర్లపై ఒక విశ్లేషణ... 1.జిందాల్‌స్టీల్‌ అండ్‌ పవర్‌: నవంబర్‌ సీరిస్‌లో ఓఐ 9.6 శాతం పెరిగింది. ఇదే సమయంలో ధర 18 శాతం పెరిగింది. కంపెనీ గారెపల్మా కోల్‌బ్లాక్‌ను తాజా వేలంలో గెలుచుకోవడంతో ట్రేడర్లు ఈ

Most from this category