News


యస్‌ బ్యాంక్‌ 8 శాతం డౌన్‌

Wednesday 9th October 2019
Markets_main1570597553.png-28780

గత కొంత కాలంగా నిధుల సమీకరణలో ఇబ్బందులు పడుతున్న యెస్‌ బ్యాంక్‌, ప్రమోటర్‌ రాణా కపూర్‌ తన వాటాను విక్రయించుకోవడంతో మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయింది. బ్యాంక్‌కు అవసరమైన నిధులను సరైనా ధర వద్దనే సమీకరిస్తామని బ్యాంక్‌ సీఈఓ రవనీత్‌ గిల్‌ ప్రకటించారు. కానీ దీంతో నిధుల సమీకరణ ఆలస్యం కానుందనే అంచనాలు మార్కెట్‌ వర్గాలలో వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్ల నుంచి ఈ బ్యాంక్‌ షేరు నష్టాల్లో ట్రేడవుతోంది. బుధవారం ట్రేడింగ్లో కూడా యెస్‌ బ్యాంక్‌ షేరు విలువ ఉదయం 10.30 సమయానికి 8 శాతం నష్టపోయి రూ. 42 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 45.65 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో రూ. 45.45 వద్ద ప్రారంభమై, రూ. 41.05 వద్ద కనిష్ఠాన్ని తాకింది.



You may be interested

58 డాలర్ల దిగువకు చమురు!

Wednesday 9th October 2019

  యుఎస్-చైనా మధ్య గురువారం ప్రారంభం కానున్న వాణిజ్య చర్చలలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.44 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.41 శాతం పడిపోయి బారెల్‌ 58 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.49 శాతం పడిపోయి బారెల్‌ 52.37 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‍కాగా యుఎస్‌-చైనా ప్రతినిధులు

16 పైసలు బలహీనపడిన రూపీ

Wednesday 9th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం 16 పైసలు బలహీనపడి 71.18 వద్ద ప్రారంభమైంది. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతోపాటు, విదేశీ నిధల ఔట్‌ఫ్లో కొనసాగడంతో అక్టోబర్‌ 7 సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు క్షీణించి 71.02 వద్ద ముగిసింది. అక్టోబర్‌ 8న దసరా సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు కావడంతో మార్కెట్‌లు ఓపెన్‌ కాలేదు.    ఆర్‌బీఐ రేట్‌ కట్‌ ప్రభావం

Most from this category